Posts

Showing posts from August, 2023

నా లోని "నేను" - 27 [Helping]

Image
నేడు నేను విన్న "మంచి" మాట 👇👇👇👇👇👇👇👇👇 మనం తిన్న మంచి "తిండి", మరో పూటకు అరిగిపోతుంది.  మనం కొన్న మంచి "బట్ట", మరో సంవత్సరానికి చినిగిపోతుంది.  కానీ ......  మనం చేసిన మంచి "పని", మన సృష్ఠికర్త దగ్గర ఉన్న,,  మన లెక్కలో  వ్రాయబడుతుంది.  అంటే, మనం ఇతరులకు చేసిన "మంచి" శాశ్వతం అన్నమాట.  👆పై మాటలు నేను "జీవనవిద్య" ఆదివారం(27.8.2023) రిఫ్రెషర్ కోర్స్ సెషన్ లో రికార్డు చేసిన వీడియో లో విన్నాను.  ప్రతీ ఆదివారం, ఉదయం 7గంటలనుంచి, 8.30 వరకు ఈ online zoom క్లాస్ (free for all)ఉంటుంది.  నేను సాధ్యమైనంత వరకు ప్రతీ ఆదివారం ఈ జూమ్ మీటింగ్ కు అటెండ్ అవుతాను. అలా అటెండ్ కాలేకపోతే, YouTube లో CHDHC వాళ్ళు  upload చేసిన వీడియోలో చూస్తాను/వింటాను.    ఇక్కడ మంచి పని అంటే, మన వలన ఇతరులకు మంచి జరగటం అన్నమాట.  అది మన ద్వారా ధన సహాయం కావచ్చు, మాట లేదా చేత సహాయం కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, అదీ లేకపోతే మన మాటల ద్వారానో,  చిరునవ్వు ద్వారానో  ఇతరుల మనోభావాలను ఉత్తేజపరచడం కావచ్చు.    ఐతే, ఇలా ఇతరులకు మంచి, సేవ, సహాయం చేసి...

నా లోని "నేను" - 26

Image
నిన్న అంటే 21.8.2023 ఉదయం మన పుత్తూరు ఫ్రెండ్, కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే, ఈ నెల 25,26,27 తేదీలలో పుత్తూరు లో తిరునాళ్ళు జరుగుతాయని, మన ఫ్రెండ్స్ చాలా మందిని కలవాలంటే ఇది మంచి అవకాశం అని, నన్ను పుత్తూరు కు రమ్మని చెప్పారు. నాకు కూడా మన పాత ఫ్రెండ్స్ ను కలిసేందుకు ఇది మంచి అవకాశంగా కనబడింది.  ఇంతలో నాకు మన ఫ్రెండ్ BS Verma గారు గుర్తుకు వచ్చారు. ఆయన ఈ మధ్యనే, నాతో చాలాసేపు ఫోన్ లో, మన పుత్తూరు జ్ఞ్యాపకాలగురించి మాట్లాడారు. తిరుపతికి గానీ, పుత్తూరు కు గానీ వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారు. అందుకని అయనకు ఫోన్ చేసి, పుత్తూరు తిరునాళ్ల విషయం చెప్పాను. అంతకు ముందే కృష్ణారెడ్డిగారు తనకు ఫోన్ చేశారని, అయితే ఇప్పుడు తాను తిరుపతిలో గోల్డెన్ తులిప్ హోటల్ లో  ఉన్నానని చెప్పారు.  ఫ్రీగానే ఉన్నానని చెబితే, నేను హోటల్ కు వెళ్లి వర్మ గారిని కలిసాను. వర్మ గారు, ఆయన సతీమణి గారు కోడూరు లో ఒక పెండ్లి అటెండ్ చేసి, వాళ్ళ పెద్దబ్బాయి కొరకు తిరుపతి హోటల్ లో వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి లో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ పెండ్లి చూసుకొన్న తరువాత అందరూ బెంగళూరు వెళ్ళిపోతారంట.  1974 లో కల...

నా లోని "నేను" - 25 [గుర్తింపు]

Image
19.8.2023 సాయంత్రం, తిరుపతి బాలాజీ కల్యాణమండపం లో   మా ex కోలీగు సుబ్రమణ్యం రెడ్డిగారి కూతురి పెండ్లికి అటెండ్ అయ్యాను.  అక్కడికి చాలామంది పాత బ్యాంకు మిత్రులు వచ్చారు.  కొందరైతే మూడు లేదా నాలుగు సంవత్సరాల తరువాత కలిశారు.  అంతమందిని ఒక్కసారిగా చూడటం, వారితో మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.    అందులో ఒకరన్నారు, "నసీర్ భయ్యా, మిమ్ములను వెయ్యి మందిలో ఉన్నా గుర్తుపట్టొచ్చు" అని.  ఇది బహుశా, నా తలమీద ఉన్న టోపీ, నేను ధరించే  జుబ్బా & పైజామా  వల్ల అయివుండచ్చు.  కొందరు మిత్రులు, నా వలన బ్యాంకులో పనిచేస్తున్న టెంపోరరీ ఎంప్లాయిస్ కు మేలు జరిగింది అని అన్నారు.  కొందరు, నా బ్లాగుపోస్టు లను రెగ్యులర్ గా చదువుతున్నామని, అవి బాగున్నాయని అన్నారు.  ఆలోచిస్తూఉంటే, నాకు ఈ గుర్తింపు మీద ఉండాల్సిన దానికన్నా, కాస్త ఎక్కువ "ఆసక్తి" ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఇలా విభిన్నమైన దుస్తులను ధరిస్తూ,, "బ్లాగ్" ద్వారా, నా ఆలోచనలను పంచుకొంటూ, అందరికీ గుర్తుండాలని ప్రవర్తిస్తున్నానేమో!!    అయితే, బాహ్య వేషధారణ వల్ల వచ్చే గుర్తింపు కన్న...

నా లోని "నేను" - 24 [సక్సెస్ స్టోరీ]

Image
నేను చాలా సంవత్సరాలుగా  గమనించిన ఒక వ్యక్తి  స్ఫూర్తిదాయక జీవిత కధనంతో,  ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇతని పేరు ప్రకాష్.   తిరుపతి, తీర్థకట్ట వీధిలో ఉన్న కోట్ల రూపాయల  విలువ చేసే క్రింది ఫొటోలో ఉన్న   శ్రీ రాఘవేంద్ర స్వీట్ షాప్ కు ఈయనే  "ఓనర్".  1997 లో ఏమీ లేని క్రింది స్థాయి నుంచి, ఈ రోజు ఈ స్థాయికి ప్రకాష్ గారు  వచ్చారు.  నేను రెండు రోజులకు ముందు ఆ షాపుకు వెళ్ళినప్పుడు, "ప్రకాశం, చాలా తక్కువ స్థాయి నుంచి కోటీశ్వరుని స్థాయికి ఎదిగిన  నీ గురించి, నా బ్లాగ్ లో వ్రాయాలని అనుకొంటున్నాను. మరి నన్ను  వ్రాయమంటావా?" అని అడిగాను.  "దానిదేముంది, వ్రాయండి సార్" అని ఆయన అన్నారు.  డబ్బు లేదనో, పరిస్థితులు కలసి రాలేదనో, తగిన చదువు లేదనో,,, చాలా మంది, చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యక , తమ కలలను "కల్లలు" చేసుకొంటారు.  అలాంటి వారికి కనువిప్పు కలగాలని, ప్రస్తుతం యువతలో ఉన్న నిరాశ, నిస్పృహలు తొలగించాలనే కోరికతో, ప్రకాష్ గారి జీవిత ప్రయాణం గురించిన వివరాలు సేకరించి,  అందరికీ  ఈ బ్లాగుపోస్టు ద్వారా తెలియ చేసే ప్రయత్...

నా లోని "నేను" - 23

Image
ప్రియ మిత్రులారా, మీ అందరికీ 77 వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు.  ఈ రోజు ఉదయం వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఉంటే, అన్నీ స్వతంత్ర దిన శుభాకాంక్షలతో,  నా మనస్సుకు హాయిని కలిగించాయి.  కానీ, ఒక  highly educated  ప్రొఫెషనల్స్ ఉన్న గ్రూప్ లో పోస్ట్ అయిన   క్రింది మెసేజ్ మాత్రం, నా మనస్సును కలచివేసింది.  ఆ మెసేజ్, దానికి నేను పంపిన  రెస్పాన్స్ ను,, copy/paste 👇చేస్తున్నాను.    విచిత్రమైన వ్యంగ్యం😔   విద్యుత్ రేటు సాధారణ పౌరులు యూనిట్‌కు రూ.7.85.  మసీదు యూనిట్‌కు రూ. 1.85  చర్చి యూనిట్‌కు రూ. 1.85  ఆలయం యూనిట్‌కు రూ.7.85..  ఇది మన లౌకిక భారతదేశం.  ఇదొక విచిత్రమైన సంబంధం.  మసీదు ప్రైవేట్ ఆస్తి అయితే ప్రభుత్వం మతపెద్దలకు ఎందుకు జీతాలు చెల్లిస్తుంది?  దేవాలయం ప్రభుత్వ ఆస్తి అయితే పూజారికి ప్రభుత్వ జీతం ఎందుకు రావడం లేదు?  దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది.   కానీ ఎందుకు అలా?   ఈ స్వరాన్ని విచ్ఛిన్నం చేయవద్దు  అంగీకరిస్తే ఫార్వార్డ్ చేయవచ్చు  ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరీమణులకు ఈ...

నా లోని "నేను" - 22

Image
My dear Friends, Greetings to you all.  ఇంకొన్ని రోజులలో నేను 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని, 65వ సంవత్సరం లోకి ఎంటర్ అవుతున్నాను.  నా క్లాస్మేట్స్, రిటైర్ అయిన నా  EX. కొలీగ్స్, అందరూ ఒకటీ రెండు సంవత్సరాలు, అటూ ఇటూగా, ఇదే ఏజ్ గ్గ్రూప్ లోనే  ఉంటారు కదా!  60 సంవత్సరాల తరువాత, ఒక విధంగా మనము బోనస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు.  బాధ్యతలు తీరిపోయి, చిన్నవో, పెద్దవో ఆరోగ్య సమస్యలతో, టైంపాస్ ఎలా చెయ్యాలో తోచక కొట్టుమిట్టాడు పరిస్థితి.  నాకు తెలిసి ఒక్కరో, ఇద్దరో క్రొత్త ఉద్యోగం లో చేరటమో, స్వంత బిజినెస్ లోనో, స్వంత వ్యవసాయం లోనో,, బిజీ గా వుంటున్నారు.  మిగతా మిత్రులందరూ, ఉంటే మనమలతో ఆడుకోవటం, సంతానం దూరంలో ఉద్యోగాలు చేసుకొంటూ వుంటే, వీళ్ళు స్వంత ఊళ్లలో మిత్రులతో కబుర్లాడుకొంటూ టైంపాస్ చేస్తున్నారు.  నేను కూడా చెన్నై లో,  నా మానమరాలితో ఆడుకొంటూ టైంపాస్ చేస్తున్నాను. అయితే, ఆ పాప ఇప్పుడు యూకేజీ లో చేరి స్కూల్ కు వెళుతోంది. ఉదయం 8గంటలకంతా బయలుదేరి వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రానికి రావటం తో,  ఈ మధ్య నాకు చెన్నైలో  టైంపాస్ ఎలా చెయ్యాలో తెలీక, తికమ...

నా లోని "నేను" - 21

Image
చూస్తూ ఉండగానే, కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో అనిపిస్తోంది.  అప్పట్లో, అంటే డిగ్రీ చదివే రోజుల్లో,  నాగిరెడ్డిగారు రెడ్డి&రెడ్డి కాలనీ లో రూమ్ తీసుకొని ఉండేవారు. నేను భవానీ నగర్ లో ఉన్న మా స్వాంతఇంట్లో ఒక రూంలో ఉండేవాణ్ణి. నాగిరెడ్డి గారి అమాయకమైన ముఖం లో ఎప్పుడూ నవ్వు ఉండేది. ఆ నవ్వును చూసేందుకే వాళ్ళ రూంకు వెళ్ళేవాడిని.  అప్పుడప్పుడు నాగిరెడ్డిగారి రూంలో ఉన్న బీకామ్ స్టూడెంట్స్ అయిన ప్రభాకర్ రెడ్డిగారిని, విశ్వనాథరెడ్డిగారిని కలిసేందుకు కుడా వెళ్ళేవాడిని. తరువాత ఉద్యోగ పర్వంలో ప్రభాకర్ రెడ్డి గారు గ్రామీణబ్యాంకు లోనే చేరటం, ఎప్పుడో 15ఏండ్ల తరువాత ప్రభాకర్ రెడ్డిగారిని కలవటం జరిగింది. అయితే మేమిద్దరం ఎక్కడా కలిసి పనిచేయలేదు.  మన క్లాసుమేట్ గజేంద్రబాబు గారు, నాగిరెడ్డిగారు రెగ్యులర్ టచ్ లో ఉంటారంట. గజేంద్రబాబుగారు కుడా గ్రామీణబ్యాంక్ లోనే పనిచేశారు. ప్రస్తుతం, ఆయన USA లో కొడుకుల దగ్గర ఉన్నారు.  నిన్న అంటే 12.8.2023 సాయంత్రం ఫోన్ చేసి, నాగిరెడ్డిగారి ఇంటికి వెళ్ళాను. అక్కడ తీసిన సెల్ఫీ 👇 నాగిరెడ్డిగారి ఫోన్ నెంబర్: 97033 88063. పద్మావతి కళ్యాణమంటపాల సముదాయం ...

నా లోని "నేను" - 20 [Degree Friends]

Image
వాట్సాప్ లో, ఈరోజు మన ఫ్రెండ్ రవీంద్రా గారి పోస్ట్ లో ని  కోరిక మేరకు, నాదగ్గర ఉన్న మన డిగ్రీ ఫ్రెండ్స్ ఫోటో మరియు ఇతర వివరాలు ఇవి. 👇 మన క్లాసుమేట్ రామకృష్ణ గారు 2020 సంవత్సరంలో,  పై వివరాలను నాకు పంపారు. వీటి ఆధారంతోనే, అప్పట్లో మన వాట్సాప్ గ్రూప్ create  చేసాను.  పై ఫొటోలో 23,26, 34, 39 సీరియల్ నెంబర్ స్టూడెంట్స్ పేర్లు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి.  మన డిగ్రీ మిత్రులందరినీ కలవాలనేది నా కోరిక. ఒక్కొక్కళ్ళతో కలుస్తూ, ఆ పాత జ్ఞ్యాపకాలను "నెమరువేసుకొని", ఆతరువాత  మీ అందరితో పంచుకొంటాను.  ధన్యవాదములు 🙏, మీ ప్రియమిత్రుడు, అబ్దుల్ నసీర్ [94911 35998] మన డిగ్రీ మిత్రులంతా, కనీసం ప్రస్తుతం తిరుపతి లో ఉన్న వారైనా , ఒక రోజు మధ్యాహ్నం, ఒక హోటల్ లో కలిసి భోజనం చేసుకొంటూ, మాట్లాడుకొంటే బాగుంటుంది కదా. 

నా లోని "నేను" - 19

Image
  ఈ రోజు, అంటే, 12.8.2023 ఉదయం 7గంటల ప్రాంతం లో వాకింగ్ చేస్తూ, మన డిగ్రీ క్లాసుమేట్ సహదేవరెడ్డిగారి ఇంటికి వెళ్ళాను.  "ఆయన మిద్దె పైన ఉన్నారు" అని వాళ్ళ సతీమణిగారు చెప్పారు. సరే అని డైరెక్టుగా మిద్దెమీదకు వెళ్లే టప్పటికి, అక్కడ పరిస్థితి ఇది. 👇 సహదేవరెడ్డిగారు, మంచి ప్రశాంతమైన వాతావరం ఉన్న వీధిలో స్వంత ఇల్లు కట్టుకొని, తన భార్యతో ఆ ఇంటిలో ఉంటున్నారు. మిద్దెమీద ఒక పెంట్హౌస్ ఉంది. దాంట్లో, ఉదయ 6 నుంచి 8.30 వరకు వివిధ రకాలైన వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ ఉంటారంట. అక్కడికి ఫోన్ కూడా తీసుకొని వెళ్లకుండా, పుర్తిగా ఆరోగ్యం మీద  కాన్సన్ట్రేట్ చేస్తారంట.  నేను వెళ్లిన కొంతసేపటికి, తన సైక్లింగ్ ఆపి వచ్చారు. అప్పుడు ఈ సెల్ఫీ 👇తీసుకొన్నాను.  ఎప్పుడు చెన్నై నుంచి తిరుపతి వచ్చావు అని నన్ను అడిగితే, 20 రోజులు ఐయ్యింది అని చెప్పాను. ఈసారి చాలా రోజులు ఉండిపోయావే అని అడిగితే, అవును, నా మనుమరాలు ఇప్పుడు స్కూల్ లో, యూకేజీ కి వెళుతోంది. కాబట్టి చెన్నై లో టైంపాస్ అవ్వటంలేదు. అందుకే, నేను, నా భార్య తిరుపతి వచ్చేసాం. ఇక్కడ బోర్ కొడితే చెన్నై వెళతాం అని చెప్పాను..  అప్పడు, ఆయన, "...

నా లోని "నేను" - 18

Image
నిన్న అంటే, 10.8.2023 ఉదయం 11.30 ప్రాంతం లో తిరుపతి లో మన రిటైర్డ్ SGB స్టాఫ్ రన్ చేస్తున్న society లోకి వెళ్లాను. అక్కడ సుబ్రమణ్యం రెడ్డిగారు నన్ను చూసిన వెంటనే, చాలా సాదరంతో ఆహ్వానించారు.   సుబ్రహ్మణ్యం రెడ్డిగారి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి, తప్పనిసరిగా ఈ నెల 19వ తేదీన నన్ను  తిరుపతిలోనే ఉండేటట్లు ప్లాన్ చేసుకొని, రిసెప్షన్ కు  రావలసిందిగా ఆహ్వానించారు.  ఇది ఒకవిధంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే, అక్కడికి ఆరోజు, చాలా మంది మన బ్యాంకు  మిత్రులు వస్తారు కాబట్టి, వారిని కలిసే అవకాశం ఉంటుంది కదా.  అక్కడ ఉన్న మన మిగతా మిత్రులను కవర్ చెయ్యాలని ఈ క్రింది వీడియో తీసాను.  క్రొద్ది సేపటి తరువాత నరసింహారెడ్డి గారు అక్కడికి  వచ్చారు. వీరిని చూసి చాలా కాలం అయింది. ఈయన, నేను, శివారెడ్డిగారి పీరియడ్ లో శ్రీకాళహస్తిలో పనిచేశాము. అప్పటి సంగతులు గుర్తుచేసుకొంటూ,కొంత టైం పాస్ చేసిన తరువాత, ఆఫీస్ క్లోజ్ చేసి బయలు దేరేముందు, ఈ ఫోటో తీశాను. 👇 ఇందులో నరసింహారెడ్డి గారిని, మాధవరెడ్డిగారిని, శివారెడ్డిగారిని, మునికృష్ణారెడ్డిగారిని, సుబ్రమణ్యం...

నా లోని "నేను" - 17

Image
  ప్రియమిత్రులారా! ప్రస్తుతం నేను తిరుపతిలో ఉంటూ, నా schoolmates, collegemates & ex. collegues ను కలుస్తూ,, వారితో నా జ్ఞ్యాపకాలను గుర్తుచేసుకొంటూ, ఈ విషయాలు ఇలా బ్లాగ్ లో భద్రపర్చుకొని, భవిష్యత్తులో మరలా చూసుకునేందుకు ఏర్పాటు చేసుకొంటున్న సంగతి,,, మీ అందిరికీ తెలుసుకదా.  గత వారం, తిరుపతి లో టైపు ఇన్స్టిట్యూట్ లో మన మిత్రుడు KK రమేష్ గారిని కలిసాను. ఆ విషయం మీతో ఇంతకుముందు బ్లాగ్ లో పంచుకొన్నానుకదా.  4 రోజుల ముందు, మన పుత్తూరు స్కూల్ లో చదువుకొన్న శ్రీహరి గారికి వాట్సాప్ లో ఎలా ఉన్నారు, మనం కలుద్దామని మెసేజ్ పెట్టాను. అందుకు ఆయన రిప్లై ఇస్తూ, 2 నెలల క్రితం ఆక్సిడెంట్ ఐయ్యింది కాబట్టి, ఇంటినుంచి బయటకు రావటంలేదు అని మెసేజ్ పెట్టారు.  ఆయన ఇంటి అడ్రస్ లొకేషన్ పెట్టమని అడిగి, ఆ లొకేషన్ ప్రకారం, నిన్న అంటే 10.8.2023 ఉదయం 11 గంటల ప్రాంతం లో ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలిసాను.  మన శ్రీహరి గారు యోగ క్లాస్ చెప్పటానికి, స్కూటర్ లో వెళుతూ ఉంటే, ఎదురుగా ఇంకో వెహికల్ లో వచ్చిన అతను డాష్ ఇవ్వటంతో, శ్రీహరి గారు పడిపోయారంట. కుడి అరచేతి లో బాగా గాయమై,, స్పృహ కోల్పోయారంట. రక్తం చ...

నా లోని "నేను" - 16

Image
  నిన్న అంటే 6.8.2023 ఆదివారం సాయంత్రం 7 గంటలకు, ISKON టెంపుల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్ లో, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్సిబిషన్ జరుగుతోందని, అదీ లాస్ట్ డే అనీ, నాకు తెలిసింది.  చూసొద్దాం అని వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్లాను.  అక్కడ స్టాల్స్ అన్నీ చూసుకొంటూ వెళుతుంటే,,,,  రోటరీ క్లబ్ స్టాల్ లో మన మిత్రులు 👇ముగ్గురు కూర్చొని ఉన్నారు.   జయచంద్రనాయుడు గారిని నేను రెగ్యులర్ గానే కలుస్తున్నాను. విష్ణుప్రసాద్ గారిని కలిసి చాలా కాలం అయ్యింది. అయితే రవికుమార్ గారిని కలిసి దాదాపు 17 సంవత్సారాల పైనే అయ్యింది అనుకొంటా. నాకు గుర్తుఉండి, ఆయన నిండ్ర బ్రాంచ్ లో పనిచేసేటప్పుడు, బహుశా 2006 లో అనుకొంటా, ఆ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కు వెళ్లినట్లు గుర్తు.  జయచంద్రనాయుడు గారు [94924 84003], నేను,, ముదరందొడ్డి బ్రాంచ్ లో 1999 లో అనుకొంటా, కలిసి పనిచేశాము. కానీ, తరువాత రేగులర్గా మేమిద్దరం అప్పుడప్పుడూ  కలుస్తూనే ఉన్నాం. నేను రేణిగుంట లో హెల్పింగ్ హాండ్స్ ఆఫీస్ పెట్టి అక్కడ ఉన్నప్పుడు, ఆయన ఒకరోజు సాయంత్రం అక్కడకు వచ్చి,,  రిటైర్ అయినతరువాత  మా HHF సర్వీస్ అక్టీవిటీస్ లో త...

నా లోని "నేను" - 15

Image
 ప్రియమిత్రులారా! నా సైడ్ సర్వం కుశలం. మీ సైడ్ కూడా same అనుకొంటాను. ప్రస్తుతం నేను తిరుపతి భవానీ నగర్ లో ఉంటున్నాను.  చాలా ఫ్రీ టైం ఉంది, వంట్లో శక్తి ఉంది. ఓపిక ఉంది  కాబట్టి, మనమిత్రులను కలిసి కొంతసేపు టైంపాస్ చేస్తే బాగుంటుందని అనిపించి, ఈ మధ్య నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, సహుద్యోగులను కలవటం స్టార్ట్ చేసాను.  మిత్రులను కలవటం, పాతవిషయాలను గుర్తుచేసుకోవటం, వాళ్ళతో సెల్ఫీ తీసుకోవటం, ఈవిధంగా జ్ఞాపకాలను భద్రపర్చుకోవటం చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ బ్లాగుపోస్టు లను చూసుకొని టైంపాస్ చెయ్యచ్చు అనేది ఒక అభిప్రాయం. ఈ క్రమం లో నిన్న, అంటే 5.8.2023 వ తేదీ  సాయంత్రం, మన డిగ్రీ క్లాసుమేట్ రవీంద్ర గారికి ఫోన్ [78934 33412]చేసి,ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికివెళ్ళి ఆయనను కలిసాను. అప్పుడు తీసుకొన్న సెల్ఫీ ఇది.  రవీంద్రను గుర్తుపట్టారా? ఈయనను నేను 1995 లో సదుం లో కలిసాను. అప్పుడు ఆయన అక్కడి ఇండియన్ బ్యాంకు లో పనిచేస్తూ ఉండేవారు. నేను గ్రామీణబ్యాంక్ లో పనిచేస్తూ, Inspection పనిమీద సదుం కు వెళ్ళినప్పుడు, సడన్ గా అక్కడ కనిపించారు. దాని  తరువాత ఇదే మేము కలవటం. ...

నా లోని "నేను" - 14

Image
My dear BALLIA friends, Greetings. నేను, అంటే అబ్దుల్ నసీర్, బలియా లో M.Sc (Ag) Remidial Course లో  "1980 లో" జాయిన్ అయ్యాను.  అప్పుడు PV కోటేశ్వర్ రావు గారు, సుధాకర్ రెడ్డి గారు నాకు చాలా సహాయం చేశారు.  మనోహర్ రెడ్డి గారి initiative తో 14.2.2021 న 35 మంది బలియా లో చదివిన వాళ్ళం కలిసాం.  ఆరోజు కడపకు వచ్చిన వారి ఫోటోలు, మిగతా వివరాలకొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.  https://helpinghandsnaseer.blogspot.com/2021/02/my-ballia-memories.html   ఆ తరువాత, నేను హైద్రాబాద్ లో మా  M.Sc (Ag) Economics classmate మధుసూదన్ రెడ్డి గారిని ఒకసారి కలిసాను. ఆ తరువాత నేను మన Ballia ఫ్రెండ్స్ ఎవ్వరితో కలవటం కుదర్లేదు.  నా పాత ఫోన్ మార్చటం తో  మన బలియ మిత్రుల ఫోన్ నంబర్స్ లో చాలా నంబర్లు మిస్ అయ్యాయి. నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్స్ తో మళ్ళీ "Ballia మిత్రులు" పేరుతో ఈమధ్యనే ఒక వాట్సాప్ గ్రూప్ తయారుచేసి, messages పెట్టటం స్టార్ట్ చేశాను.  వీలును బట్టి మన Ballia మిత్రులను పర్సనల్ గా కలుద్దాం అని అనుకోని, నా  M.Sc (Ag) Remidial Course classmate రాజు గారిత...