"I" in me / నా లోని "నేను" - 3
[English version is after the below “telugu” version ] సెల్ఫ్-స్టార్టర్ మనకు మంచి పేరు, ప్రఖ్యాతులు, ఇంకా ఎన్నో, ఎన్నో "సాధించాలనే" కోరికలు ఉంటాయి. అవకాశాలు లేవనో, రాలేదనో, మనం ఎదురుచూస్తూ ఉంటాము. అనేక కారణాల వలన, మన "సమయం" అంతా,ఆ ఎదురుచూపులోనే అయిపోతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మనకు కావలసింది దొరకాలంటే, ముందుగా మనం "సెల్ఫ్-స్టార్టర్" గా మారాలి. మనకు కావలసిన పరిస్థితులను/అవకాశాలను మనమే కల్పించుకొంటూ, ముందుకు సాగా గలిగితే, అప్పుడు మనలను ఆపగలిగేవారుండరు కదా! ఇందుకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. నేను 1980s లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు, ఇప్పటిలా క్యాంపస్ సెలెక్షన్స్, ఎన్నో కంపెనీస్ లో సాఫ్ట్-వేర్ ఉదోగాలు దొరికేవి కావు. జాబ్స్ లిమిటెడ్ గా ఉండేవి. కష్టపడి వ్రాత పరీక్షల్లో పాస్ అయి, మెరిట్ లో interveiw దాకా వెళ్లినా, అక్కడ 1 పోస్ట్ కొరకు 10 నుంచి 15 కాండిడేట్స్ ను పిలిచేవారు. ఇంటర్వ్యూలో వాళ్ళ ప్రశ్నలకు ఏమి సమాధానం చెబుతాం అనే దాని కన్నా, ఎలా చెబుతాం అన్నదానిమీదే మన సెలక్షన్ ఆధారపడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అందు...