Posts

Showing posts from February, 2024

మంచి శాలరీ వచ్చే బ్యాంకు జాబ్ కు, నేను ఎందుకు resign చేసాను?

Image
My dear friends, Greetings. నిన్న రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో, తిరుపతి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుపల్లే గ్రామానికి సమీపంలోని "గోపాలపురం గ్రామం" లో జరిగిన రైతుల అవగాహన సదస్సు కు అటెండ్ అయ్యాను. రోటరియన్ రామ్ మోహన్ రెడ్డి గారి కారులో ముందు సీట్లో ఆయనతోపాటు, ప్రసాద్ గారు, వెనక సీట్లో దామోదర్ గుప్త గారు, నేను వెళ్ళాము. విలేజ్ రోడ్డు కాబట్టి ప్రయాణం దాదాపు గటన్నర సేపు సాగింది.  ప్రయాణ సమయంలో దామోదర్ గుప్త గారు ఆంధ్రాబ్యాంక్ లో పని చేశారని, మా గ్రామీణ బ్యాంకు లో చాలా మందితో పరిచయం ఉందని, తెలిసింది.  నేను ఎందుకు మంచి  శాలరీ వచ్చే బ్యాంక్ జాబ్ కు రిజైన్ చేశానో చెప్పాల్సిన సందర్భం వచ్చి, కారు ప్రయాణం కాబట్టి, తీరికగా ఆయనకు క్రింది సంఘటన వివరించాను. 2007 సంవత్సరం ఋణమాఫీ వస్తుందని పుకార్లు వచ్చాయి. అప్పుడు నేను ఎర్రవారిపాళెం  గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ లో పనిచేసే వాణ్ణి. బ్యాంక్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, LDM కలిసి జాయింట్ గా.....   ఋణ మాఫీ ఉండదని ,  రైతుల దగ్గర నుంచి అప్పులు వసూలు చేయాల్సిందేనని సర్క్యులర్ ఇచ్చారు. బ్యాంక్స్ లో వచ్చే జీతం, "వడ్డ...