మంచి శాలరీ వచ్చే బ్యాంకు జాబ్ కు, నేను ఎందుకు resign చేసాను?

My dear friends,
Greetings.

నిన్న రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో, తిరుపతి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుపల్లే గ్రామానికి సమీపంలోని "గోపాలపురం గ్రామం" లో జరిగిన రైతుల అవగాహన సదస్సు కు అటెండ్ అయ్యాను. రోటరియన్ రామ్ మోహన్ రెడ్డి గారి కారులో ముందు సీట్లో ఆయనతోపాటు, ప్రసాద్ గారు, వెనక సీట్లో దామోదర్ గుప్త గారు, నేను వెళ్ళాము.

విలేజ్ రోడ్డు కాబట్టి ప్రయాణం దాదాపు గటన్నర సేపు సాగింది. 

ప్రయాణ సమయంలో దామోదర్ గుప్త గారు ఆంధ్రాబ్యాంక్ లో పని చేశారని, మా గ్రామీణ బ్యాంకు లో చాలా మందితో పరిచయం ఉందని, తెలిసింది. 

నేను ఎందుకు మంచి  శాలరీ వచ్చే బ్యాంక్ జాబ్ కు రిజైన్ చేశానో చెప్పాల్సిన సందర్భం వచ్చి, కారు ప్రయాణం కాబట్టి, తీరికగా ఆయనకు క్రింది సంఘటన వివరించాను.


2007 సంవత్సరం ఋణమాఫీ వస్తుందని పుకార్లు వచ్చాయి. అప్పుడు నేను ఎర్రవారిపాళెం  గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ లో పనిచేసే వాణ్ణి.

బ్యాంక్ చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టరు, LDM కలిసి జాయింట్ గా.....  
ఋణ మాఫీ ఉండదని
రైతుల దగ్గర నుంచి అప్పులు వసూలు చేయాల్సిందేనని సర్క్యులర్ ఇచ్చారు.

బ్యాంక్స్ లో వచ్చే జీతం, "వడ్డీ" డబ్బుల ద్వారా వస్తుందని,,, 
100 రూపాయల జీతానికి 200 రూపాయలు పని చెయ్యకపోతే,,, 
జీతం డబ్బులు అనేక రోగాలకు ధారపోయ్యాలని నా ప్రగాఢ విశ్వాసం. 
అందుకని నా డ్యూటీ విషయంలో, బ్యాంక్ అప్పుల వసూలు లో ఏ విధమైన కనికరం చూపకుండా, కఠినంగా  ఉండేవాడిని. ఈ క్రమంలో రైతులను "బాగా పీడించే వాడిని".
పాపం బీద రైతులు నా మాటలకు, పనులకు భయపడి, 
నాకు విలువనిచ్చి అప్పులు ఏదోవిధంగా బాధపడి కట్టేవారు.
బాగా బలసిన వాళ్ళు మాత్రం.... 
"నీవు ఏం పీక్కొంటావో పీక్కో, మేం మాత్రం కట్టం" అని ముఖం మీదే అనేవారు.

ఆ పరిస్థుతులలో...
మా బ్రాంచ్ గోల్డ్ అప్రైజర్ బ్రహ్మచారి అని ఉండేవాడు. 
అతను తీసుకొన్న ₹.50,000 క్రాప్ లోన్, అసలు, వడ్డీ కలిపి లక్ష దాటింది. 
అందరికీ అప్పులు కట్టమని రిజిస్టర్ నోటీసులు వ్రాస్తున్న నేను..
"బ్రహ్మాచారీ, మీకు కూడా నోటీసు వ్రాస్తున్నాను. అది మీ ఇంటికి వస్తె బాగుండదు. 
అందుకని ఇక్కడే తీసుకొని, అది అందినట్లు సంతకం పెట్టండి" అన్నాను. 

ఆయన సంతకం పెట్టి నోటీసు తీసుకొని ......  
"సార్, ఋణ మాఫీ వస్తుంది అంటున్నారు. నా పరిస్థితి మీకు తెలుసు కదా! 
అందుకని నాకు టైమ్ ఇవ్వండి సార్" అని వేడుకున్నాడు.

కఠిన హృదయంతో నేను "అదంతా నాకు తెలియదు. 
వెంటనే అప్పు కట్టి renewal చేసుకోండి" అన్నాను.

పాపం ఎక్కడో లక్ష పైన అప్పు చేసి తీసుకొని వచ్చి, 
అసలు + వడ్డీ కట్టి, మళ్ళా ₹.50,000 క్రొత్త క్రాప్ లోన్ తీసుకొన్నాడు. 
ఇది జరిగిన వారానికి ఋణమాఫీ అనౌన్స్ చేశారు. 
అప్పులు కట్టని వారికి మొత్తం ఋణమాఫీ చేసి, 
కొత్తగా మళ్లీ లోన్స్ ఇవ్వమని ఆర్డర్స్ వచ్చాయి.

అప్పుడు బ్రహ్మచారి నా దగ్గరకు వచ్చి.......  
"ఎంత పని చేశారు సార్. బయట రెండు రూపాయలకు అప్పు తెచ్చి కట్టాను. కట్టని వాళ్ళందరికీ అంతా పోయి, కొత్త లోన్స్ ఇస్తున్నారు. నాకు మీ వలన చాలా నష్టం జరిగింది" అన్నాడు.

*"ఆ మాటలు నా కళ్ళు తెరిపించాయి."*
బ్యాంకింగ్ వ్యవస్థ లో బీదవారికి, పలుకుబడి లేనివారికి జరుగుతున్న 
"అన్న్యాయం" కళ్ళకు కట్టినట్లు కనబడింది. 

అప్పటికే పనివత్తిడితో బాధపడుతున్న నేను, 
బీదలకు జరిగే అన్యాయం లో కూడా భాగస్వామి కావటం ఇష్టంలేక, 
వెంటనే రెసిగ్నషన్ లెటర్ వ్రాసి, శ్రీ శివారెడ్డి గారిదగ్గర పెట్టాను. 

శ్రీ శివారెడ్డిగారు, నేను అంతకుముందు శ్రీకాళహస్తి లో కలిసి పనిచేశాము. 
అంతేకాక, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. 
ఆయన నా రెసిగ్నషన్ లెటర్ చదివి "ఎం, తమాషా చేస్తున్నారా?" అని 
కోపంతో చించి పడేసారు. 
ఆయనకు నా మనోవ్యధనంతా వివరించి, 
మళ్ళీ ఒక రెసిగ్నషన్ లెటర్ వ్రాసి ఆయన ముందు ఉంచాను. 
"నేను మాత్రం మీ రెసిగ్నషన్ లెటర్ HO కు ఫార్వర్డ్ చెయ్యను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి", అన్నారు. ఆయన లీవ్ పెట్టిన రోజున నేనే నా రెసిగ్నషన్ లెటర్ ను HO కు ఫార్వర్డ్ చేసేసాను. 

 నా రెసిగ్నషన్ లెటర్ వెళ్లిన తరువాత, 
అప్పటి బ్యాంకు చైర్మన్ శ్రీ RV చంద్రశేఖర్ రావు గారు నన్ను ఎర్రావారిపాళెం బ్రాంచ్ నుంచి, నా స్వంత ఊరు ఐన తిరుపతి లో శ్రీనివాసం బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేశారు. 
ఒక రోజు శ్రీ RV చంద్రశేఖర్ రావు గారు మా బ్రాంచ్ కు వచ్చి దాదాపు అరగంటపాటు 
నా బ్రెయిన్ waash చేశారు. తొందరలో బ్యాంకు పెన్షన్ స్కీం వస్తుందని, 
ఇప్పుడు నేను resign చేస్తే పెన్షన్ రాదనీ, 
నా మొండి పట్టుదల వాళ్ళు నా కుటుంబ సభ్యులకు అన్యాయం చెయ్యవద్దని కోరారు. అందుకని, నా రెసిగ్నషన్ లెటర్ ను కాన్సల్ చెయ్యమని నా దగ్గర లెటర్ వ్రాయించుకొని, 
నా రెసిగ్నషన్ అప్లికేషన్ ను cancel చేసేసారు. 

కొన్ని కారణాల వల్ల శ్రీనివాసం బ్రాంచ్ మూసివేయాల్సి వచ్చింది. 
అప్పుడు నన్ను మళ్ళీ ఎర్రావారిపాలెం బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేశారు. 

అక్కడ బ్రహ్మాచారీ మొఖం రోజూ చూస్తూ, 
*"ఎం పేరుక్కొంటావో పెరుక్కుపో"* అన్న వాళ్లకి లోన్స్ ఇస్తూ ఉండటం 
నన్ను విపరీతమైన అశాంతికి గురిచేసింది. 
మా బ్యాంకులో పనిచేసే మిత్రులు అందరూ, అలా ఆలోచించవద్దని, 
మిగతా వారంతా పనిచేసినట్లే, అందరిలా నన్నూ చెయ్యమని చెప్పటం స్టార్ట్ చేశారు. 
అయినా మనసొప్పక, అన్నీ ఆలోచించుకొని, 
రెండవసారి రెసిగ్నషన్ లెటర్ ను HO కు పంపించాను. 

ఈ సారి HO నుండి పర్సనల్ మేనేజర్ శ్రీ Y ఆనంద్ గారు నా భార్యకు డైరెక్ట్ గా ఫోన్ చేసి, 
నేను జాబ్ కు resign చేసిన సంగతి చెప్పి, ఆమె objection చెబితే, 
నా రెసిగ్నషన్ ను cancell చేయిస్తానని చేప్పారు. 
జవాబుగా నా భార్య, నా ఇష్టమే, తన ఇష్టమని చేప్పేసింది. 
ఇంకా వేరే దారి లేక, నా రెసిగ్నషన్ ను accept చేసి నన్ను 21.2.2009 వ తేదీన releave చేసేసారు. 

నాతొ పై విషయంగా ఎమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకునేవారు, 
నా పర్సనల్ నెంబర్ 9491135998 కు కాంటాక్ట్ చెయ్యండి. 

నా కన్నా చిన్నవాళ్లకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే..... 
మన మనస్సుకు నచ్చని పని చేస్తూ లక్షలు సంపాదించే కన్నా,
వేరే నచ్చిన పనిచేసుకొంటూ బ్రతికితే, ఆనందం, జీవితానికి సార్థకతా వస్తాయి. 

మీరు ఏమంటారు?



Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories