నా లోని "నేను" - 19
ఈ రోజు, అంటే, 12.8.2023 ఉదయం 7గంటల ప్రాంతం లో వాకింగ్ చేస్తూ, మన డిగ్రీ క్లాసుమేట్ సహదేవరెడ్డిగారి ఇంటికి వెళ్ళాను.
"ఆయన మిద్దె పైన ఉన్నారు" అని వాళ్ళ సతీమణిగారు చెప్పారు. సరే అని డైరెక్టుగా మిద్దెమీదకు వెళ్లే టప్పటికి, అక్కడ పరిస్థితి ఇది. 👇
సహదేవరెడ్డిగారు, మంచి ప్రశాంతమైన వాతావరం ఉన్న వీధిలో స్వంత ఇల్లు కట్టుకొని, తన భార్యతో ఆ ఇంటిలో ఉంటున్నారు. మిద్దెమీద ఒక పెంట్‌హౌస్ ఉంది. దాంట్లో, ఉదయ 6 నుంచి 8.30 వరకు వివిధ రకాలైన వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ ఉంటారంట. అక్కడికి ఫోన్ కూడా తీసుకొని వెళ్లకుండా, పుర్తిగా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తారంట.
నేను వెళ్లిన కొంతసేపటికి, తన సైక్లింగ్ ఆపి వచ్చారు. అప్పుడు ఈ సెల్ఫీ 👇తీసుకొన్నాను.
ఎప్పుడు చెన్నై నుంచి తిరుపతి వచ్చావు అని నన్ను అడిగితే, 20 రోజులు ఐయ్యింది అని చెప్పాను. ఈసారి చాలా రోజులు ఉండిపోయావే అని అడిగితే, అవును, నా మనుమరాలు ఇప్పుడు స్కూల్ లో, యూకేజీ కి వెళుతోంది. కాబట్టి చెన్నై లో టైంపాస్ అవ్వటంలేదు. అందుకే, నేను, నా భార్య తిరుపతి వచ్చేసాం. ఇక్కడ బోర్ కొడితే చెన్నై వెళతాం అని చెప్పాను..
అప్పడు, ఆయన, "అందుకే నేను నా భార్య సింగపూర్ వెళ్లకుండా ఇక్కడే ఉండేది. నా మనమరాళ్ళు ఇద్దరూ స్కూల్ కు, కూతురు, అల్లుడు ఆఫీస్ కు వెళుతారు కాబట్టి, మాకు అక్కడ టైంపాస్ కాదు. ఇక్కడైతే, మధ్యాహ్నం వరకూ ఈపని, ఆపని చూసుకొని, మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి కోళ్లఫారం కు వెళ్లి, రాత్రి 8 గంటలకు వస్తాం" అని చెప్పారు.
తరువాత మన క్లాసుమేట్ నాగిరెడ్డికి ఫోన్ చేసి మేమిద్దరం మాట్లాడాము. ఈ రోజు సాయంత్రం నేను urbanhat దగ్గర ఉన్న నర్సరీ లో మొక్కలు తీసుకోవటానికి వచ్చినప్పుడు కలుస్తాను, అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
పాపానాయుడుపేట లో ఉన్న నాగరాజగుప్త ఎవరు, ఆయన ఫోటో ఉందా అని అడిగాను. లేదు అని చెప్పారు. కాలేజీ సంగతులు మాట్లాడుకొంటూ ఉంటే, మన క్లాసుమేట్ వెంకటరమణారెడ్డి ఫోన్ నెంబర్ ఉందని చెప్పారు. ఆయనతో మాట్లాడాలి అంటే, క్రిందకు వెళ్లి ఫోన్, దానితోపాటు అద్భుతమైన టేస్ట్ ఉన్న "మిల్లెట్స్ పౌడర్ పాలు" తీసుకొని వచ్చారు.
తొమ్మిది రకాల మిల్లెట్స్ ను శుభ్రపరిచి, వేయించి, మెషిన్ లో పౌడర్ చేయించి, ఒక కవర్ లో భద్రంగా ఫ్రిడ్జ్ లో పెడతారంట. ఒక బాటిల్ లో ఆ పౌడర్ కొంత తీసి ఉంచుకొని, వాడుకొంటూ ఉంటారంట. ఆ పౌడర్ లో బెల్లం పొడి, చిక్కని పాలతో కలిపి త్రాగితే, టెస్టుకు టేస్ట్, శరీరానికి బలం, ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. ఒక కప్పు త్రాగిన తరువాత నాకు కూడా చాలా బలం వచ్చిన ఫీలింగ్ వచ్చింది.
అప్పడు ఫోన్ చేసి వెంకటరమణా రెడ్డి గారితో ఆయన మాట్లాడిన తరువాత, నేను మాట్లాడాను. వెంకటరామారెడ్డిగారిని కలిసి చాలా సంవత్సరాలు ఐయ్యింది. ఆ ఫోన్ నెంబర్ మన గ్రూప్‌లో లేదు కాబట్టి, దానిని మనగ్రూప్ లోకి పోస్ట్ చేసి, మన గ్రూప్ లో ఆడ్ చెయ్యమని మన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రవీంద్రగారికి మెసేజ్ పెట్టాను.
అప్పటికి నేను వచ్చి అరగంటపైగా ఐయ్యింది. సరే బయలుదేరుతామని బయటకు వచ్చి, ఈ వీడియో తీశాను. 👇
ఇది ఇంటిమిద్దెమీద ఉన్న పెంట్ హౌస్ ముందు భాగం. చాలా చక్కగా గార్డెనింగ్ చేస్తున్నారు. నాకు కుడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే వివరాలు కనుక్కొని అక్కడినుంచి బయలుదేరాను.
ఇప్పటికి ఇంతే. మరొక మిత్రుణ్ణి కలిసి ఆ వివరాలతో మళ్ళీ మీముందుకు వస్తాను.
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [94911 35998]
గమనిక: ఈ గ్రూప్ లో లేని మన డిగ్రీ ఫ్రెండ్స్ అందరికీ ఈ బ్లాగ్ లింక్ ను ఫార్వర్డ్ చెయ్యండి. వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మన వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ చెయ్యండి.

Comments