నా లోని "నేను" - 15
ప్రియమిత్రులారా!
నా సైడ్ సర్వం కుశలం.
మీ సైడ్ కూడా same అనుకొంటాను.
ప్రస్తుతం నేను తిరుపతి భవానీ నగర్ లో ఉంటున్నాను.
చాలా ఫ్రీ టైం ఉంది, వంట్లో శక్తి ఉంది. ఓపిక ఉంది కాబట్టి, మనమిత్రులను కలిసి కొంతసేపు టైంపాస్ చేస్తే బాగుంటుందని అనిపించి, ఈ మధ్య నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, సహుద్యోగులను కలవటం స్టార్ట్ చేసాను.
మిత్రులను కలవటం, పాతవిషయాలను గుర్తుచేసుకోవటం, వాళ్ళతో సెల్ఫీ తీసుకోవటం, ఈవిధంగా జ్ఞాపకాలను భద్రపర్చుకోవటం చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ బ్లాగుపోస్టు లను చూసుకొని టైంపాస్ చెయ్యచ్చు అనేది ఒక అభిప్రాయం. ఈ క్రమం లో నిన్న, అంటే 5.8.2023 వ తేదీ సాయంత్రం, మన డిగ్రీ క్లాసుమేట్ రవీంద్ర గారికి ఫోన్ [78934 33412]చేసి,ఇంటి అడ్రస్ కనుక్కొని అక్కడికివెళ్ళి ఆయనను కలిసాను. అప్పుడు తీసుకొన్న సెల్ఫీ ఇది.
రవీంద్రను గుర్తుపట్టారా? ఈయనను నేను 1995 లో సదుం లో కలిసాను. అప్పుడు ఆయన అక్కడి ఇండియన్ బ్యాంకు లో పనిచేస్తూ ఉండేవారు. నేను గ్రామీణబ్యాంక్ లో పనిచేస్తూ, Inspection పనిమీద సదుం కు వెళ్ళినప్పుడు, సడన్ గా అక్కడ కనిపించారు. దాని తరువాత ఇదే మేము కలవటం.
రవీంద్రగారు డిగ్రీ ఇంగ్లీష్ మీడియం లో డిగ్రీ చదివారు. పీజీ చేసిన తరువాత ఇండియన్ బ్యాంకు లో జాయిన్ అయ్యారు. రిటైర్మెంట్ తరువాత, ఇంతకాలం హైదరాబాదు లో కొడుకు కోడలు, మానమరాలితో ఉండేవారు. కొడుకు కుటుంబం కెనడా వెళ్లారు కాబట్టి, ఒక నెల క్రితం నుంచి, తిరుపతి విద్యానగర్ కాలనీ లో ఉన్న స్వంత ఇంటిలో ప్రస్తుతం ఆయన, ఆయన భార్యతో కలసి ఉంటున్నారు.
మన డిగ్రీ క్లాస్మేట్స్ విషయాలు, ఉద్యోగ విషయాలు చాలా సేపు మాట్లాడుకున్నాము. ఖాళీటైం లో నేను మిద్దెమీద మట్టికుండలలో మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను అంటే, ఆయన ఇంటివెనుక కూడా ఖాళీస్థలం ఉంది, దాంట్లో ఎమన్నా చెయ్యాలి అని చేప్పారు.
ఇంటి వెనక చాలానే స్థలం ఉంది. మంచి గార్డెన్ డెవలప్ చెయ్యవచు. అదే ఆయనకు చెప్పాను.
మా కామన్ క్లాసుమేట్ రామకోటేశ్వర్ రావు తో ఫోన్ లో మేము ఇద్దరం మాట్లాడిన తరువాత, నేను రవీంద్ర గారి దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను.
అన్నట్లు, తిరుపతి లో ఉన్న మనమిత్రులు అందరూ ఎక్కడైనా హోటల్ లో లంచ్ కు కానీ, డిన్నర్ కు గానీ కలిస్తే బాగుంటుంది కదా అని రవీంద్ర గారు చెప్పారు. ఇది మంచి ఆలోచన. ప్రస్తుతానికి నాకు తెలిసి, తిరుపతిలో నేను, రవీంద్ర, నాగిరెడ్డి, సహదేవరెడ్డి ఉన్నాము. గజేంద్రబాబు విదేశంలో ఉన్నట్లు తేలేసింది. మన డిగ్రీ క్లాస్మేట్స్ ఫోటో కొరకు వెదికితే దొరకలేదు. మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఈ క్రింది సగం ఫోటోనే ప్రస్తుతం నాదగ్గర avaialble ఉంది.
పై ఫోటో వాట్సాప్ గ్రూప్ create చేసినప్పుడు అప్లోడ్ చేసింది. మీదగ్గర ఫుల్ ఫోటో ఉందా? ఉంటె మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చెయ్యండి.
మీ దగ్గర మన డిగ్రీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ ఉంటే నాకు inform చెయ్యండి. మనమంతా ఒకసారి కలుద్దాం.
ఈ బ్లాగుపోస్టు లింక్ ను మన డిగ్రీ ఫ్రెండ్స్ కు పంపి నా ఫోన్ numbar 9491135998 కు కాంటాక్ట్ చేయమని చెప్పండి. నేను వీలుచూసుకొని మన ఫ్రెండ్స్ అందరినీ పర్సనల్ గా కలవాలని అనుకొంటున్నాను.
ఇప్పటి ఇంతే. త్వరలో ఇంకో మిత్రుణ్ణి కలిసి ఆ వివరాలతో ఇంకో బ్లాగుపోస్టు పెడతాను.
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [9491135998]




Comments