నా లోని "నేను" - 14
My dear BALLIA friends,
Greetings.
నేను, అంటే అబ్దుల్ నసీర్, బలియా లో M.Sc (Ag) Remidial Course లో "1980 లో" జాయిన్ అయ్యాను.
అప్పుడు PV కోటేశ్వర్ రావు గారు, సుధాకర్ రెడ్డి గారు నాకు చాలా సహాయం చేశారు.
మనోహర్ రెడ్డి గారి initiative తో 14.2.2021 న 35 మంది బలియా లో చదివిన వాళ్ళం కలిసాం.
ఆరోజు కడపకు వచ్చిన వారి ఫోటోలు, మిగతా వివరాలకొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
ఆ తరువాత, నేను హైద్రాబాద్ లో మా M.Sc (Ag) Economics classmate మధుసూదన్ రెడ్డి గారిని ఒకసారి కలిసాను. ఆ తరువాత నేను మన Ballia ఫ్రెండ్స్ ఎవ్వరితో కలవటం కుదర్లేదు.
నా పాత ఫోన్ మార్చటం తో మన బలియ మిత్రుల ఫోన్ నంబర్స్ లో చాలా నంబర్లు మిస్ అయ్యాయి. నా దగ్గర ఉన్న ఫోన్ నంబర్స్ తో మళ్ళీ "Ballia మిత్రులు" పేరుతో ఈమధ్యనే ఒక వాట్సాప్ గ్రూప్ తయారుచేసి, messages పెట్టటం స్టార్ట్ చేశాను.
వీలును బట్టి మన Ballia మిత్రులను పర్సనల్ గా కలుద్దాం అని అనుకోని, నా M.Sc (Ag) Remidial Course classmate రాజు గారితో ఫోన్ లో, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను. ఆయన స్వంత ఊరు అయిన "కోడూరు" లో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం నేను తిరుపతి లో ఉంటున్నాను. ఇక్కడినుంచి కోడూరు 1 గంట ప్రయాణం. అందుకని నిన్న అంటే, 3. 8. 2023 ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి కోడూరు కు వెళ్ళాను. రాజు గారు నన్ను రిసీవ్ చేసుకొని, వాళ్ళ స్వంత గ్రామమైన "ఉర్లగడ్డపోడు" లో ఉన్న ఆయన ఇంటికి పిలుచుకొని వెళ్లారు. చాలా ప్రశాంతమైన వాతావరణం లో, చుట్టూ అరటితోటల తో ఆయన నివాస స్థానం చాలా బాగుంది. ఆయన ఇంటి దగ్గర తీసిన సెల్ఫీ ఇది. 👇ఆయన దగ్గర మన బలియా మిత్రుల ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగితె, ఆయన ఆల్బం లో పెట్టిన ఈ క్రింది ఫోటోలను చూపించారు.
ఈ క్రింది ఫోటో Ballia లో తీసినది. ఇందులో రాజుగారు, మనోహర్ రెడ్డి గారు, ఇంకొకాయన పేరు గుర్తుకు రావటం లేదు.
ఈ క్రింది ఫోటో మన Ballia హాస్టల్ మేడమీద తీసినది. దీంట్లో రాజు గారు, సుదర్శన్ గారు, సుధాకర్ బాబు గారు ఉన్నారు.
సుధాకర్ బాబు గారి నేటివ్ ప్లేస్ తిరుపతి. అయితే తిరుపతి లో ఆయన ఉన్నారా లేదా అనే విషయం నాకు తెలియదు. మీ దగ్గర సుధాకర్ బాబు గారి ఫోన్ నెంబర్ ఉంటె నాకు inform చెయ్యండి.
రాజుగారి దగ్గర ఉన్న మన Ballia మిత్రుల ఫోన్ నంబర్స్ తీసుకొని, నా ఫోన్లో ఫీడ్ చేసుకొన్నాను.
మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత, రాజు గారు నన్ను కోడూరు లో డ్రాప్ చేశారు.
వీలు చూసుకొని మన Ballia మిత్రులను వాళ్ళు ఉండే చోటికే వెళ్లి కలుద్దామని అనుకొంటున్నాను.
ఈ బ్లాగుపోస్టు లింక్ ను మన Ballia మిత్రుల వాట్సాప్ గ్రూప్ లకు ఫార్వర్డ్ చేసి, నా ఫోన్ నెంబర్ ను సేవ్ చేసుకోమని చెప్పండి. మీదగ్గర ఉన్న మన Ballia మిత్రుల ఫోన్ నంబర్స్ నాకు పంపండి ప్లీజ్.
ధన్యవాదములు 🙏,
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [94911 35998]
.




Comments