నా లోని "నేను" - 17
ప్రియమిత్రులారా!
ప్రస్తుతం నేను తిరుపతిలో ఉంటూ, నా schoolmates, collegemates & ex. collegues ను కలుస్తూ,, వారితో నా జ్ఞ్యాపకాలను గుర్తుచేసుకొంటూ, ఈ విషయాలు ఇలా బ్లాగ్ లో భద్రపర్చుకొని, భవిష్యత్తులో మరలా చూసుకునేందుకు ఏర్పాటు చేసుకొంటున్న సంగతి,,, మీ అందిరికీ తెలుసుకదా.
గత వారం, తిరుపతి లో టైపు ఇన్స్టిట్యూట్ లో మన మిత్రుడు KK రమేష్ గారిని కలిసాను. ఆ విషయం మీతో ఇంతకుముందు బ్లాగ్ లో పంచుకొన్నానుకదా.
4 రోజుల ముందు, మన పుత్తూరు స్కూల్ లో చదువుకొన్న శ్రీహరి గారికి వాట్సాప్ లో ఎలా ఉన్నారు, మనం కలుద్దామని మెసేజ్ పెట్టాను. అందుకు ఆయన రిప్లై ఇస్తూ, 2 నెలల క్రితం ఆక్సిడెంట్ ఐయ్యింది కాబట్టి, ఇంటినుంచి బయటకు రావటంలేదు అని మెసేజ్ పెట్టారు.
ఆయన ఇంటి అడ్రస్ లొకేషన్ పెట్టమని అడిగి, ఆ లొకేషన్ ప్రకారం, నిన్న అంటే 10.8.2023 ఉదయం 11 గంటల ప్రాంతం లో ఆయన ఇంటికి వెళ్లి ఆయనను కలిసాను.
మన శ్రీహరి గారు యోగ క్లాస్ చెప్పటానికి, స్కూటర్ లో వెళుతూ ఉంటే, ఎదురుగా ఇంకో వెహికల్ లో వచ్చిన అతను డాష్ ఇవ్వటంతో, శ్రీహరి గారు పడిపోయారంట. కుడి అరచేతి లో బాగా గాయమై,, స్పృహ కోల్పోయారంట. రక్తం చాలా పోవటం, చేతి నరాలు దెబ్బతిని చేతి కదలికలు లేకపోవటంతో,, చెన్నై లోని SRM హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకొన్నారంట. ప్రస్తుతం కుడిచేతి వ్రేళ్ళు ముడుచుకోవటం కాస్త కష్టం గా ఉంది. Otherwise, మిగతా విషయాలలో బాగానే ఉన్నారంట.
శ్రీహరి గారికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెండ్లిళ్లు అయి వాళ్లకు కుడా పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం శ్రీహరి గారు, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనుమరాలితో, తిరుపతిలోనే స్వంత అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.
మన స్కూల్ విషయాలు చాలా సేపు గుర్తుచేసుకొన్నాము. ఆయన స్వంత ఊరు "నందిమంగళం" నుంచి పుత్తూరుకు వచ్చేవారు.
డిగ్రీ చదివేందుకు పుత్తూరు నుంచి ఆయన, రామకృష్ణ[రైల్వే], గొల్లపల్లె స్వామి[రైల్వే], విజయకుమార్[డాక్టర్], మొదలుగు 30 మందిదాకా, తిరుపతికి రోజూ వచ్చేవారంట. అప్పట్లో ట్రైన్ పుత్తూరు లో stopping లోకపోతే, విజయకుమార్ తిరుత్తణి నుంచి వస్తూ పుత్తూరు దగ్గర చైన్ లాగి ఆపితే, అక్కడ ట్రైన్ ఎక్కి, తిరుపతి వెళ్లేవారంట. అలాగే రిటర్న్ తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు, పుత్తూరు లో చైన్ లాగి ఆపేవారంట.
ఒకసారి ఆ ట్రైన్ లో Railway GM గారు వచ్చినప్పుడు, స్టూడెంట్స్ట్రై న్ చైన్ లాగి ఆపితే, అది చాలా దూరం వెళ్లి ఆగిందంట. అప్పుడు GM గారు ట్రైన్ ను వెనకకు అంటే పుత్తూరు కు తీసుకొని వెళ్లి, అక్కడ ఎక్కిన స్టూడెంట్స్ రైల్వే పాస్ లో అన్నీ చెక్ చేసి, చూసి, ఒక పాసెంజర్ ట్రైన్ ట్రైన్ ను, అరక్కోణం నుంచి తిరుపతి కి స్తూడెంట్స్ కొరకు ఆరెంజ్ చేసారంట.
ఈ బ్లాగ్ పోస్ట్ చదువుతున్న పుత్తూరు స్టూడెంట్స్ కు, ఆ పాత మధుర జ్ఞ్యాపకాలు అన్నీ గుర్తుకు వస్తాయనుకొంటాను.
ఒకసారి శ్రీహరి గారితో మీరుకూడా మాట్లాడండి. ఆయన ఫోన్ నెంబర్ నెంబర్ 81254 46311.
ఈ బ్లాగుపోస్టు లింక్ ను మీ దగ్గర ఉన్న పుత్తూరు ఫ్రెండ్స్ అందరికీ పంపండి.
ఇప్పటికింతే. ఇంకొక ఫ్రెండ్ ను కలిసి, ఆ విషయాలు మీతో త్వరలో పంచుకొంటాను.
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్.
94911 35998.
ఈరోజు అంటే, 22.8.2023, మన శ్రీహరి గారు, పుత్తూరు నుంచి తిరుపతి డిగ్రీ చదువు కొరకు అప్పట్లో రోజూ ట్రైన్ లో వెళ్లే వాళ్ళ ఫోటో పంపారు. ఈ క్రింది ఫోటో చూసుకొంటే, అప్పటి రోజులు, ఆ మధుర జ్ఞపకాలు గుర్తుకు వస్తున్నాయి కదా!!
Names top standing T.Ramakrishna, Subramanyam ( Gollapalli Swamy ), Chandra Reddy, Sampath(Batani shop)second standing T.k.Sekar, Ravi Nagari Gunasekar, K. Ravichandran fifth person name forgot and N.S.Rajan.sitting Raveendra, Muthukumar,S.Sreehari, D.s.Ganesh Ulaganadhan and Govidharajulu (ontimitta)
పై ఫోటో & అందులో ఉన్న వారి పేర్లు పంపినందుకు, శ్రీహరి గారికి ధన్యవాదములు. 🙏


Comments