నా లోని "నేను" - 27 [Helping]
నేడు నేను విన్న "మంచి" మాట 👇👇👇👇👇👇👇👇👇 మనం తిన్న మంచి "తిండి", మరో పూటకు అరిగిపోతుంది. మనం కొన్న మంచి "బట్ట", మరో సంవత్సరానికి చినిగిపోతుంది. కానీ ...... మనం చేసిన మంచి "పని", మన సృష్ఠికర్త దగ్గర ఉన్న,, మన లెక్కలో వ్రాయబడుతుంది. అంటే, మనం ఇతరులకు చేసిన "మంచి" శాశ్వతం అన్నమాట. 👆పై మాటలు నేను "జీవనవిద్య" ఆదివారం(27.8.2023) రిఫ్రెషర్ కోర్స్ సెషన్ లో రికార్డు చేసిన వీడియో లో విన్నాను. ప్రతీ ఆదివారం, ఉదయం 7గంటలనుంచి, 8.30 వరకు ఈ online zoom క్లాస్ (free for all)ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు ప్రతీ ఆదివారం ఈ జూమ్ మీటింగ్ కు అటెండ్ అవుతాను. అలా అటెండ్ కాలేకపోతే, YouTube లో CHDHC వాళ్ళు upload చేసిన వీడియోలో చూస్తాను/వింటాను. ఇక్కడ మంచి పని అంటే, మన వలన ఇతరులకు మంచి జరగటం అన్నమాట. అది మన ద్వారా ధన సహాయం కావచ్చు, మాట లేదా చేత సహాయం కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, అదీ లేకపోతే మన మాటల ద్వారానో, చిరునవ్వు ద్వారానో ఇతరుల మనోభావాలను ఉత్తేజపరచడం కావచ్చు. ఐతే, ఇలా ఇతరులకు మంచి, సేవ, సహాయం చేసి...