నా లోని "నేను" - 21

చూస్తూ ఉండగానే, కాలం ఎంత తొందరగా గడిచిపోయిందో అనిపిస్తోంది. 
అప్పట్లో, అంటే డిగ్రీ చదివే రోజుల్లో,  నాగిరెడ్డిగారు రెడ్డి&రెడ్డి కాలనీ లో రూమ్ తీసుకొని ఉండేవారు. నేను భవానీ నగర్ లో ఉన్న మా స్వాంతఇంట్లో ఒక రూంలో ఉండేవాణ్ణి. నాగిరెడ్డి గారి అమాయకమైన ముఖం లో ఎప్పుడూ నవ్వు ఉండేది. ఆ నవ్వును చూసేందుకే వాళ్ళ రూంకు వెళ్ళేవాడిని.  అప్పుడప్పుడు నాగిరెడ్డిగారి రూంలో ఉన్న బీకామ్ స్టూడెంట్స్ అయిన ప్రభాకర్ రెడ్డిగారిని, విశ్వనాథరెడ్డిగారిని కలిసేందుకు కుడా వెళ్ళేవాడిని. తరువాత ఉద్యోగ పర్వంలో ప్రభాకర్ రెడ్డి గారు గ్రామీణబ్యాంకు లోనే చేరటం, ఎప్పుడో 15ఏండ్ల తరువాత ప్రభాకర్ రెడ్డిగారిని కలవటం జరిగింది. అయితే మేమిద్దరం ఎక్కడా కలిసి పనిచేయలేదు. 

మన క్లాసుమేట్ గజేంద్రబాబు గారు, నాగిరెడ్డిగారు రెగ్యులర్ టచ్ లో ఉంటారంట. గజేంద్రబాబుగారు కుడా గ్రామీణబ్యాంక్ లోనే పనిచేశారు. ప్రస్తుతం, ఆయన USA లో కొడుకుల దగ్గర ఉన్నారు. 

నిన్న అంటే 12.8.2023 సాయంత్రం ఫోన్ చేసి, నాగిరెడ్డిగారి ఇంటికి వెళ్ళాను. అక్కడ తీసిన సెల్ఫీ 👇

నాగిరెడ్డిగారి ఫోన్ నెంబర్: 97033 88063. పద్మావతి కళ్యాణమంటపాల సముదాయం ప్రక్కనుంచి వెళ్లే వీధి 5వ  రోడ్ లో ఈయన స్వంత ఇల్లు ఉంది. ప్రస్తుతం, ఈయన భార్యతో పాటు ఇక్కడ ఉంటున్నారు. ఈయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెండ్లిళ్లు అయి, ఒక్కొక్క సంతానం. ఒక కొడుకు హైదెరాబాద్ లో, ఇంకొక కొడుకు కోడూరు దగ్గర ఒబులాయపల్లెలో ఉదోగాలు చేసుకొంటూ అక్కడే ఫామిలీ తో ఉంటున్నారు. 

రెండు నెలల క్రితం జ్వరం వచ్చినప్పటినుంచి, నాగిరెడ్డి గారికి నడవటానికి, పనిచేయటానికి బద్దకంగా ఉందంట. ఏదైనా వ్యాపకం పెట్టుకోమని డాక్టర్ చెప్పాడంట. నాగిరెడ్డిగారి భార్యకు వాళ్ళ స్వంతఊరులో ఉండి, పనిచేసుకోవాలని ఉందంట. కానీ, ఈయనకు అది ఇష్టం లేదంట. ఆవిడగారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. 

Urabanhot దగ్గర ఉన్న nursary కి వెళ్లి మొక్కలు తెద్దాం, రమ్మని అంటే నాతొ పాటు వచ్చేందుకు రెడీ అయ్యారు. వాళ్ళ ఇంట్లో కుడా మొక్కలు పెంచుతున్నారు. 👇

నేను, నాగిరెడ్డిగారు nursary వెళ్లి, ఒక సెంటుజాజి, రెండు పారిజాతం మొక్కలు కొన్నాం. 
నాగిరెడ్డిగారిని పద్మావతి కళ్యాణమండపాల సముదాయం దగ్గర డ్రాప్ చేసి, నేను వచ్చేసాను. వచ్చేముందు, ప్రతీరోజూ తప్పనిసరిగా వాకింగ్ చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఒక ఉచిత సలహా ఇచ్చాను. 

కరోనాకు ముందు, నాగిరెడ్డిగారి మనమరాలి పుట్టినరోజు సందర్భం గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళివుంటిని. తరువాత, ఫోనులో అప్పుడప్పుడు మాట్లాడుకొంటూ ఉన్నా, దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇదే ఆయనను కలవటం. 

ఇప్పటికింతే. ఇంకొక మిత్రుడిని కలసిన తరువాత, ఆ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. 

మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [94911 35998]

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories