Posts

Showing posts from April, 2023

RAMZAAN prayer & wish

Image
  Thanks a lot for your "Greetings" on the occassion of RAMZAAN I cordially reciprocate the sentiments  and wish the same to you. May ALMIGHTY bless you & your family,  with good Health & HAPPINESS. On this occasion, I sincerely pray..... May "Almighty" BLESS us all with 👇 "COURAGE" to change,  what can be changed, 💚 "PATIENCE" to accept,  which can not be changed, 💞 "WISDOM" to know the difference,  in between to above two. 💫 with regards 🙏 Please Help the "needy" by following 👇 https://helpinghandsnaseer.blogspot.com/2020/07/helping-hands-strategy.html?m=1

"I" in me / నా లోని "నేను" - 8

Image
                                                [English Version follows the below Telugu Version]           ఆలోచించి తీసుకొన్న "సాహసోపేతమైన నిర్ణయాలు" తృప్తిని ఇస్తాయి   ఈ సంవత్సరం జనవరి నెలలో, నేను, నా భార్యా, తిరుపతి గ్రామీణ బ్యాంకు శాఖలో లాకర్ ఆపరేట్ చెయ్యటానికి వెళ్ళాము. అప్పుడు అక్కడ పనిచేస్తున్న ఒక యంగ్ లేడీ ఆఫీసర్ నాతో "సార్, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలనుకొంటున్నాను, ఏమీ అనుకోకండీ.   మీరు మంచి సీనియారిటీ పోసిషన్ లో, ఫాట్ సాలరీ తీసుకొంటూ ఉన్నా, బ్యాంకు జాబ్ కు రిజైన్ చేసి వెళ్ళారంట కదా !, ఎందుకు?" అన్నారు.  ఏమి జవాబు చెబితే బాగుంటుందా అని నేను ఆలోచిస్తూ ఉంటే, నా ప్రక్కనే ఉన్న నా భార్య, "ఆయనకు ప్రజాసేవ అంటే ఇష్టం. అందుకు," అని చేప్పారు. అవును అంటూ తలవూపి, "నాకు ఆ లైఫ్-స్టైల్  నచ్చలేదమ్మా" అని చెప్పాను.  అలా ఆ లేడీ ఆఫీసర్ అడగటం, నా భార్య "ఆ" విధంగా సమాధానం చెప్పటం, నాకు ఒకవిధమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చాయ...

"I" in me / నా లోని "నేను" - 7

Image
  [English Version follows the below Telugu Version] ముందు ఉచితంగా "పని" చేయండి చాలా కాలం క్రితం చదివిన ఒక కధ గుర్తుకొస్తోంది.   ఒక తెలివైన వ్యక్తి, వ్యాపారం చెయ్యాలని అనుకొంటాడు.  తనకున్న పరిమితులను, చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలించుకొన్న తరువాత, ఒక రోజు సాయంత్రం మంచి రుచికరంగా "వడ" లను తయారుచేసి, తన పరిసరాలలో పనిచేసుకొంటున్న వారికి "ఉచితం" గా పంచిపెడతాడు.  ఈ విధంగా రెండు మూడు రోజులు చేసేటప్పటికి, సాయంత్రంవేళ ఆ రుచికరమైన వడలను తినటానికి అక్కడి ప్రజలు అలవాటు పడతారు. నాల్గవ రోజు, వడ ఒకటి 3 రూపాయలు అని చెప్పి ఇస్తాడు. అక్కడ లోకల్ గా దొరికే వడ ధర 5 రూపాయలు కాబట్టి, అదీగాక, అతను తమ దగ్గరికే తీసుకొని వచ్చి ఇస్తాడు, అదీ కాక రుచికరంగా కూడా ఉంటాయి కాబట్టి, అందరూ సంతోషంగా అతని వడలను కొంటారు.  కొన్ని రోజుల తరువాత, తన షాప్ కు వచ్చి తీసుకొంటే వడ కు 4 రూపాయలని, అదే వాళ్ళ వద్దకే తీసుకొని వచ్చి ఇవ్వాలంటే వడకు 7రూపాయలు అని చెబుతాడు. లోకల్ గా దొరికే వడల కన్నా, ఇతని దగ్గరి వడలు రుచికరం గా ఉంటాయి కాబట్టి, ఇవ్వగలిగే వాళ్ళు అతనికి 7రూపాయాల ధరకు, తమదగ్గరికే పంపమని చెబుతారు. అ...

"I" in me / నా లోని "నేను" - 6

Image
  [English Version follows the below Telugu Version] తృప్తికి  "మూలం"  ఎక్కడ   ? నేను తిరుపతిలో డిగ్రీ 1st year చదివే రోజుల్లో, అప్పుడు నాకు 18ఏళ్ళు అనుకొంటా, మా నాన్నగారు సత్యవేడు BDO గా పనిచేసేవారు కాబట్టి మా అమ్మ, నాన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు , సత్యవేడు లో ఉండేవారు. నేను కాలేజీ సెలవలు ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని.  ఒకసారి సెలవలు ఇచ్చినప్పుడు "పండగ కొరకు నీకు, తమ్మునికి బట్టలు తెచ్చిఉంచాను. నీ బట్టలు తీసుకెళ్లి, టైలర్ కు ఇచ్చుకో" అని నాన్నగారు చెప్పారు. నేను కాలేజీ లో చదువుకొంటున్నాను కాబట్టి, నాకు కాస్త ఖరీదైన బట్టలే కొన్నారు. కానీ, తమ్ముడి నిక్కర్ కొరకు తెచ్చిన బ్లూ కాలరు క్లాత్ కాస్త మెరుపుతో, నా బట్టలకన్నా "బాగుంది" అనిపించింది.   అది చూసి, నాకూ బ్లూ కలర్ లో ప్యాంటు కావాలని నాన్నగారిని అడిగాను. సరే అని, నాకు కూడా బ్లూ కలర్లో ఒక ప్యాంటు బిట్ తెచ్చి ఇచ్చారు. కానీ, అది తమ్ముడి నిక్కర్ క్లాత్ అంత బాగా లేదు. అదే మాట, మా నాన్నగారితో అంటే, "నీవు కాలేజీ లో చదువుకొంటావు కదా, అలా మెరుపు ఉన్న ప్యాంటు వేసుకొంటే బాగుండదు. అదీ కాకుండా, నీకు తెచ...

"I" in me / నా లోని "నేను" - 5

Image
  (English version follows the below Telugu Version) రోజూ కొంచెం, కొంచెం.   కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో, నా  ex. collegue జయచంద్ర నాయుడు గారు, క్రింది ఫోటో పంపారు.  పై  ఫోటో లోని విషయం అర్ధం అవ్వటానికి కొంత టైం పట్టినా, అర్ధం ఐన తరువాత మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది. రోజూ 1%  extra అనేది, ఒక సంవత్సరానికి 38రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.  దీనిమీద గూగుల్ లో సెర్చ్ చేస్తే, చాలా విషయాలు తెలిసాయి. దీనిని 1%  ప్రిన్సిపుల్ అంటారంట.  మనం రెగ్యులర్ గా రోజూ చేసే పని విలువ 1 అనుకొంటే, 365 రోజులకు ఫలితం సరాసరి విలువ  1 వస్తుంది.  అదే క్రమం తప్పకుండా, 0.01 (1%) ఎక్కువ చేస్తే, దాని ఫలితం 37.7 వస్తుంది. అంటే, 38 రెట్లు అన్నమాట.  మనం ఏదైనా క్రొత్తగా ఉన్నదాన్ని ట్రై చెయ్యాలను కొంటే, రోజువారీ పనులు చేసుకుంటూనే, ఆ క్రొత్త పనికి కొంత సమయం కేటాయిస్తే, మనకు మంచి రిజల్ట్స్ కనబడి, ఆ పనిని పూర్తి  చేయటానికి తగిన ఉత్స్తాహం వస్తుంది.  ఉదాహరణకు, మనకు ఒక పక్ష్యో , పువ్వో , చెట్టో, డ్రాయింగ్ చెయ్యటం ఇష్టం అనుకొందాం. కానీ రోజువారీ బిజీ పనుల వల...

"I" in me / నా లోని "నేను" - 4

Image
[English version follows the below Telugu version] రంజాన్ ఉపవాసములు ఎందుకు రంజాన్ నెలలో "శారీరిక, మానసిక సమస్యలు" తక్కువగా వస్తాయి, అన్న సందేహం నాకు వచ్చింది. దీనిమీద నాదైన రీతిలో ఎనాలిసిస్ చేసాను.  మన దినచర్యనే, అన్ని ఆరోగ్య సమస్యలకు మూలకారణం, అనేది మనకు తెలిసిందే కదా.  దినచర్య సక్రమంగా ఉంటే, ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది.  ఈ రంజాన్ నెలలో, మా ప్రాంతంలో,  మేము  .........  ఉదయం 3.30 గంటలకు నిద్రలేస్తాము.  4.45 లోపల భోజన కార్యక్రమం "సహారి" పూర్తి చేస్తాం.  5 గంటలకు నమాజ్ చేసి, తరువాత  విశ్రాంతికి ఉపక్రమిస్తాం.  9 గంటలకు, ఎవరి పనులు వాళ్ళు చెయ్యటం స్టార్ట్ చేస్తారు.  మధ్యాహ్నం 1.30కు నమాజ్.  సాయంత్రం 4.45కు నమాజ్.  6.25 గంటలకు "ఇఫ్తియార్" అంటే, ఉపవాస సమాప్తి. అంటే ఎంతో కొంత తినటం.   దాని తరువాత  6.35 కు నమాజ్.  7.30 కు రాత్రి భోజనం.  8.30 నుంచి 10గంటల వరకు [ ఒకటిన్నర గంట పాటు ] నమాజ్ చేస్తాము. ఈ నమాజ్ లో దాదాపు 50సార్లు లేచి నిలబడటం, కూర్చోవటం చెయ్యాల్సి ఉంటుంది.  కొన్ని నిముషాల తేడాతో, మనదేశం లో...