[English version follows the below Telugu version]
రంజాన్ ఉపవాసములు
ఎందుకు రంజాన్ నెలలో "శారీరిక, మానసిక సమస్యలు" తక్కువగా వస్తాయి, అన్న సందేహం నాకు వచ్చింది.
దీనిమీద నాదైన రీతిలో ఎనాలిసిస్ చేసాను.
మన దినచర్యనే, అన్ని ఆరోగ్య సమస్యలకు మూలకారణం, అనేది మనకు తెలిసిందే కదా.
దినచర్య సక్రమంగా ఉంటే, ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది.
ఈ రంజాన్ నెలలో, మా ప్రాంతంలో, మేము .........
ఉదయం 3.30 గంటలకు నిద్రలేస్తాము.
4.45 లోపల భోజన కార్యక్రమం "సహారి" పూర్తి చేస్తాం.
5 గంటలకు నమాజ్ చేసి, తరువాత విశ్రాంతికి ఉపక్రమిస్తాం.
9 గంటలకు, ఎవరి పనులు వాళ్ళు చెయ్యటం స్టార్ట్ చేస్తారు.
మధ్యాహ్నం 1.30కు నమాజ్.
సాయంత్రం 4.45కు నమాజ్.
6.25 గంటలకు "ఇఫ్తియార్" అంటే, ఉపవాస సమాప్తి. అంటే ఎంతో కొంత తినటం.
దాని తరువాత 6.35 కు నమాజ్.
7.30 కు రాత్రి భోజనం.
8.30 నుంచి 10గంటల వరకు [ఒకటిన్నర గంట పాటు] నమాజ్ చేస్తాము. ఈ నమాజ్ లో దాదాపు 50సార్లు లేచి నిలబడటం, కూర్చోవటం చెయ్యాల్సి ఉంటుంది.
కొన్ని నిముషాల తేడాతో, మనదేశం లోని ముస్లిమ్స్ అందరూ ఇదే టైం-టేబుల్ పాటిస్తారు.
సహారి తరువాత నుంచి ఇఫ్తియార్ వరకు, ఏమైనా తినటం గాని, త్రాగటం గాని, నిషిద్ధం.
రంజాన్ నెల ప్రారంభంలో ఇది క్రొద్దిగా ఇబ్బంది అనిపించినా, తరువాత అలవాటైపోతుంది.
ఇక్కడ మనం గమనిస్తే, రంజాన్ నెలంతా, ఒక టైం-టేబుల్ ప్రకారం అన్నీ జరుగుతాయి.
నోరు అదుపులో ఉంటుంది. అంటే, తినటం, త్రాగటం విషయంలో.
నమాజ్ లో నిలబడటం, కూర్చోవటం వల్ల, శరీరానికి మంచి ఎక్సర్ సైజ్ అవుతుంది.
ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయ పడుతుంది.
"ఉపవాసం ఉండటం వలన మానవుని శరీరంలో autophegy, అంటే మన శరీరంలోని మృత/అనవసర/రోగకారక కణాలను తొలగించటం అనే చర్య సహజ సిద్ధముగా జరిగి, అనేక రోగాలనుంచి మానవులు రక్షింప బడతారు" అనే విషయం కనుక్కున్నందుకు గాను, యోషినోరి ఒషుమి అనే జపాన్ శాస్త్రవేక్తకు 2016లో నోబెల్ బహుమతి ఇచ్చారు.
రంజాన్ నెల ఉపవాసాలు, మన శరీరం సంవత్సరానికి ఒకసారి autophegy జరుపుకునేందుకు వీలు కల్పిస్తాయి అన్నమాట.
ఇక మానసిక ఆరోగ్యానికి వస్తే.........
ఉపవాసం టైం లో ఇతరులతో కొట్లాడటం, దుర్భాష, నిషిద్ధం.
నమాజ్ అనేది మానవుని ఆత్మకు, అతనిని పుట్టించిన పరమాత్మకు మధ్య జరిగే సంభాషణ.
ఈ సంభాషణ లో మన కోరికలు, బాధలు విన్నవించుకొంటాము కాబట్టి, మనస్సు ప్రశాంతత చెంది, హాయిగా ఉంటుంది.
మనస్సు ప్రశాంతంగా ఉంటే, మానసిక ఆరోగ్యం ఆటోమేటిక్ గా వస్తుంది.
క్లుప్తంగా, ఒక రోజులో దాదాపు 14 గంటలపాటు, ఏమీ తినకుండా, త్రాగకుండా ఉండటం, 3 గంటల పాటు నమాజ్ అనే శారీరిక, మానసిక వ్యాయామం జరగటం వలన, ఇదంతా క్రమశిక్షణ తో జరగటం వలన, మనకు రంజాన్ నెలలో ఆరోగ్య సంబంధ సమస్యలు చాలా తక్కువగా వస్తాయి.
ఏమంటారు? మీ అభిప్రాయాలను తెలియచేస్తే, షంతోషిస్తాను .
ధన్యవాదములు 🙏
Ramzaan Fasting
I
have a doubt, why do we have less health issues, be it physical or psychological,
in Ramzaan month?
I analysed about this, in my own way.
As
we all know, our daily routine is the root cause of all our health issues.
When
our daily routine is good, then our health will also be good.
In
our area, during the month of Ramzaan, we………
Woke-up
at 3.30 AM, in the morning.
By
4.45 AM, we finish “sahaari”, which means morning food intake.
Perform
namaaz by 5 AM and thereafter, take rest.
From
9 AM onwards, we are involved in our work.
In
the afternoon, at 1.30 PM, we do namaaz.
In
the evening at 4.45, we do namaaz.
In
the evening at 6.25, there will be “iftar”, means breaking the fasting by
eating something. It will be followed by namaaz at 6.35 PM.
At
7.30 PM in the night, we take food.
From
8.30 PM to 10 PM [for one & half hour], there will be namaaz. In this process, we have to stand and sit for 50 times.
During the month of Ramzaan, Muslim community follows the above time-table across India.
Of course, there
will be some minutes’ difference in time, from place to place.
It
is prohibited to eat or drink anything, in between sahari & iftar.
Though
there may be some inconvenience in the beginning, we get adjusted to this,
soon.
Here
we can observe that, during the month of Ramzaan, everything happens, as per specific
time-table, with discipline.
In
respect of eating & drinking, there will be control.
Body
gets exercise, due to the standing and sitting postures in namaaz.
All
these help us in keeping our body in a healthy state.
In the year 2016, the Nobel Prize in Medicine was awarded to
Yoshinori Ohsumi for discoveries of the mechanisms for autophagy.
"Autophagy" is the body's way of cleaning out damaged cells, in order to regenerate
newer, healthier cells. This happens, due to continious fasting of 10 to 15 hours per day.
So Ramzaan month fasting helps the humanbody to perform the Autopahgy, once in a year.
Regarding
psychological health…….
It
is prohibited to fight with anyone or use abusive language, during fasting time.
Namaaz
is the conversation between the human soul and the creator Almighty. During this discussion,
we reveal our desires, worries to our creator. Hence, they get erased from our minds and we
become serene.
In
brief, as we don’t eat or drink for 14 hours continuously besides spending almost
3 hours in namaaz per day, with strict discipline, we will not have health ailments, during the Ramzaan
month.
I
shall be glad to know your opinions on the above.
With
regards🙏
*********
===============================
Please click on the below link....................
if you want to see the previous post of this series / ఈ సిరీస్ లోని ఇంతకు ముందు పోస్ట్ చూడాలనుకొంటే
if you want to see the next post of this series / ఈ సిరీస్ లోని తరువాతి పోస్ట్ చూడాలనుకొంటే
=================================
Comments