(English version follows the below Telugu Version)
రోజూ కొంచెం, కొంచెం.
కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లో, నా ex. collegue జయచంద్ర నాయుడు గారు, క్రింది ఫోటో పంపారు.
పై ఫోటో లోని విషయం అర్ధం అవ్వటానికి కొంత టైం పట్టినా, అర్ధం ఐన తరువాత మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది. రోజూ 1% extra అనేది, ఒక సంవత్సరానికి 38రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.
దీనిమీద గూగుల్ లో సెర్చ్ చేస్తే, చాలా విషయాలు తెలిసాయి. దీనిని 1% ప్రిన్సిపుల్ అంటారంట.
మనం రెగ్యులర్ గా రోజూ చేసే పని విలువ 1 అనుకొంటే, 365 రోజులకు ఫలితం సరాసరి విలువ 1 వస్తుంది.
అదే క్రమం తప్పకుండా, 0.01 (1%) ఎక్కువ చేస్తే, దాని ఫలితం 37.7 వస్తుంది. అంటే, 38 రెట్లు అన్నమాట.
మనం ఏదైనా క్రొత్తగా ఉన్నదాన్ని ట్రై చెయ్యాలను కొంటే, రోజువారీ పనులు చేసుకుంటూనే, ఆ క్రొత్త పనికి కొంత సమయం కేటాయిస్తే, మనకు మంచి రిజల్ట్స్ కనబడి, ఆ పనిని పూర్తి చేయటానికి తగిన ఉత్స్తాహం వస్తుంది.
ఉదాహరణకు, మనకు ఒక పక్ష్యో , పువ్వో , చెట్టో, డ్రాయింగ్ చెయ్యటం ఇష్టం అనుకొందాం. కానీ రోజువారీ బిజీ పనుల వలన అది కుదరటం లేదు అనుకొంటే, రోజూ, ఒక 5 నిమిషాలు మాత్రం కేటాయించి, క్రమం తప్పకుండా చేస్తూ పొతే, కొంత కాలానికి, ఆ డ్రాయింగ్ పూర్తి అయి, మనకు తృప్తిని ఇస్తుంది. అట్లా కాకుండా, ఏ సెలవు రోజో అది చేద్దాంలే అనుకొంటే, ఆ రోజు ఏదైనా వేరే అర్జంట్ పని పడటం, లేక మూడ్ లేకపోవటం వలన, అసలు చెయ్యాలి అనుకొన్న పనే మొదలు పెట్టకపోవడం, మొదలు పెట్టినా, సగం లోనే ఆగిపోయి పూర్తికాకపోవడం, మనందరికీ అనుభవమే కదా.
ఇలా, ఏ విషయం లో అయినాసరే మనకు రెగ్యులర్ గా చెయ్యటం అలవాటు లేనివాటిని చేయాల్సి వచ్చినప్పుడు, ఈ 1% ప్రిన్సిపుల్ విషయాలను గుర్తు చేసుకొని, అంతా ఒకేసారిగా చేసేయాలని మొదలుపెట్టి, మధ్యలో వదిలివెయ్యకుండా, రోజువారీ, కొద్ది కొద్ది గా చేసుకొంటూ, పూర్తి చేసుకొంటూ, విజయపధం లో ముందుకు సాగుదాం. ఏమంటారు?
ధన్యవాదములు 🙏
Daily to some extent
Few days back, my ex. Colleague Mr. Jayachandra Naidu ji, sent the below photo, through WhatsApp.
Though it took some time to understand, it made a tremendous impact on me. Just, daily 1% extra consistent efforts bring, 38 times extra results, over a period of 365 days. How wonderful it is!!
My Google search made me to realise many aspects of this. This is called the 1% principle.
If we assume that the value of our daily regular work is 1, then the output after 365 days avarage can be 1 only. Whereas, if consistently we do 0.01 (1%) extra on every day, then the output will be 37.7, meaning 38 times extra, for the same period.
If we want to try a new venture, then doing a small part of it daily, consistently by allotting some time, we can see good results soon, which will motivate us in a good way and to complete it successfully.
For example, we like to draw a bird or flower or a tree. But the daily busy schedule never allows us to do so. If we allot 5 minutes daily to draw what we want, then after a few days, the drawing will be complete and gives us satisfaction and a sense of fulfillment. Instead, if we want to draw the total picture on any one holiday, then due to various reasons like any exigencies or lack of mood, etc either we may not start the drawing at all or even if we start, we may leave it in the middle and never complete it.
Like this, in any new type of work about which we are interested but not accustomed to, let us remember this 1% principle, allot some time on a daily basis and do small parts of it, every day and complete it successfully, over a period of time. What do you say?
With regards🙏
===============================
Please click on the below link....................
if you want to see the previous post of this series / ఈ సిరీస్ లోని ఇంతకు ముందు పోస్ట్ చూడాలనుకొంటే
if you want to see the next post of this series / ఈ సిరీస్ లోని తరువాతి పోస్ట్ చూడాలనుకొంటే
............Please wait............
=================================
Comments