ఆనందానికి ఆది, అంతం? / Begining, ending for HAPPINESS??
{English translation of this narration follows the below Telugu transcription} ప్రియ మిత్రులారా! ఈరోజు ఒక మఖ్యవిషయం ముచ్చటించుకొందాం. మన అందరి లక్ష్యం - నిరంతరం ఆనందముగ ఉండటమే కదా! మరెందుకు మనం సుఖదుఃఖాల వలయంలో చిక్కుకొన్నాం? ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. ప్రాచీన కాలంలో మూసా ప్రవక్తకు, మన సృష్టికర్తతో డైరెక్ట్ గా మాట్లాడే శక్తి ఉండేదట. ఒకరోజు మూసా ప్రవక్త దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, తమగురించి సృష్టికర్తతో మాట్లాడి తమ సమస్యలకు సమాధానం తెలుసుకోమని కోరారు. మొదటి వక్తి, తనకు సృష్టికర్త అవసరమైన వాటికన్నా ఎక్కువ సంపద, వసతులు కల్పించాడని, ఇంక తనకు ఇవ్వడం ఆపివెయ్యమని చెప్పాడు. రెండవ వ్యక్తి, తన దగ్గర ఒక వస్త్రం తప్ప ఇంకేమీ లేదని, తనకు సిరిసంపదలు ప్రసాదించాల్సిందిగా సృష్టికర్తను కోరామని అడిగాడు. మూసా ప్రవక్త ఆ విధంగా సృష్టికర్తను కోరగా, మొదటి వ్యక్తిని, తనకు లభించినవాటికి కృతజ్ఞత చూపటం మానమని, రెండవ వ్యక్తిని తనదగ్గర ఉన్నవాటికి కృతజ్ఞత చూపమని సమాధానం వచ్చింది. పై సమాధానం విన్న మొదటివ్యక్తి , తనకు ప్రసాదించిన వాటికి కృతజ్ఞత చూపకుండా ఎలా...