ఆనందానికి ఆది, అంతం? / Begining, ending for HAPPINESS??

{English translation of this narration follows the below Telugu transcription}



ప్రియ మిత్రులారా!
ఈరోజు ఒక మఖ్యవిషయం ముచ్చటించుకొందాం.

మన అందరి లక్ష్యం - నిరంతరం ఆనందముగ ఉండటమే కదా!
మరెందుకు మనం సుఖదుఃఖాల వలయంలో చిక్కుకొన్నాం?
ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. 

ప్రాచీన కాలంలో మూసా ప్రవక్తకు, మన సృష్టికర్తతో డైరెక్ట్ గా మాట్లాడే శక్తి ఉండేదట. 
ఒకరోజు మూసా ప్రవక్త దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి, తమగురించి సృష్టికర్తతో మాట్లాడి తమ సమస్యలకు సమాధానం తెలుసుకోమని కోరారు. 

మొదటి వక్తి, తనకు సృష్టికర్త అవసరమైన వాటికన్నా ఎక్కువ సంపద, వసతులు కల్పించాడని, ఇంక తనకు ఇవ్వడం ఆపివెయ్యమని చెప్పాడు. 
రెండవ వ్యక్తి, తన దగ్గర ఒక వస్త్రం తప్ప ఇంకేమీ లేదని, తనకు సిరిసంపదలు ప్రసాదించాల్సిందిగా సృష్టికర్తను కోరామని అడిగాడు. 

మూసా ప్రవక్త ఆ విధంగా సృష్టికర్తను కోరగా, 
మొదటి వ్యక్తిని, తనకు లభించినవాటికి కృతజ్ఞత చూపటం మానమని,
రెండవ వ్యక్తిని తనదగ్గర ఉన్నవాటికి కృతజ్ఞత చూపమని
సమాధానం వచ్చింది. 

పై సమాధానం విన్న మొదటివ్యక్తి , తనకు ప్రసాదించిన వాటికి కృతజ్ఞత చూపకుండా ఎలా ఉండగలనని, అది సాధ్యం కాదని చెప్పాడు. రెండవ వ్యక్తేమో, ఏమి చూసుకొని కృతజ్ఞత చూపాలని అడిగాడు. అప్పడు గాలి బలంగా వీచి, అతని దగ్గర ఉన్న ఒక్క వస్త్రం కూడా కొట్టుకుపోయింది. 

అసలు ప్రజలు నిరంతరం ఆనందంగా ఉండకపోవటానికి కారణం ఏమిటి?
 మన దగ్గర ఉన్నదాని కంటే ఎక్కువ కావాలని కోరుకోవటమే అనుకొంటాను.  
ఆకలిగా ఉన్నప్పుడు భోజనం కావాలనిపిస్తుంది. కడుపు నిండితే, కట్టడానికి మంచి బట్టలు, ఉండటానికి మంచి ఇల్లు కావాలి. ఆ కోరిక తీరితే, తిరగటానికి వాహనాలు, ఇలా ఒక దాని వెంట ఒక కోరికలు, సముద్రం లోని అలలు మాదిరి పుడుటూనే ఉంటాయి. 
వీటితో పాటు, ప్రక్కవారికన్నా మనదగ్గర ఎక్కువ ఉండాలనే అత్యాశ ఉండనే ఉంటుంది. 

బహుశా ఇంకొంచం ఎక్కువ కావాలని కోరుకోవటమే దుఃఖహేతువేమో!! 
మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందటమే ఆనందానికి మూలం. 

ఉన్నదానితో ఆనందంగా ఉండటం, 
కృతజ్ఞత చూపటం ప్రారంభిస్తే,
నిరంతరానందం మన వశం అవుతుంది. 

మన అర్హతను బట్టి మనకు సృష్టికర్త కావలసినవి అందిస్తున్నాడని భావిస్తూ, మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞత చూపుతూ అందరం ఆనందంగా జీవిద్దాం. 
ఏమంటారు?

మీ ప్రియమిత్రుడు 
అబ్దుల్ నసీర్ 

Hey there, friends! 
Gather around for a tale that teaches us something really important.

Once upon a time, there was a wise man named Prophet Moosa. He could talk directly to God, which was pretty amazing.

One day, two people came to Moosa with different problems. The first person had a lot of things and was happy. He asked God to STOP giving him more because he didn't need it. The second person didn't have much and was sad. He asked God why he didn't have more.

Moosa asked God about their requests. God told him to tell the first person to stop being so thankful for what he had and to tell the second person to start being thankful for what he had. So Moosa told them both.

The first person couldn't stop being thankful because he had so much. The second person struggled to be thankful for just one thing - the clothes on his back. Then, a strong wind came and blew away even that.

Have you ever wondered why people aren't always happy? 

Well, it's because we always want more. When we're hungry, we want food. When we have food, we want a house. And the cycle goes on. Plus, we look at what others have and want that too.

But maybe, just maybe, always wanting more is what makes us unhappy. Maybe being happy with what we have is the real key to happiness.

Here's a simple truth: being happy with what we have makes us truly happy. We should be thankful for what we've got. That's what will keep us smiling no matter what.

So let's remember: be happy with what you have, and say thank you for it. That's the secret to real happiness.   

Yours sincerely,
Abdul Naseer.

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories