"I" in me / నా లోని "నేను" - 6

 

[English Version follows the below Telugu Version]
తృప్తికి  "మూలం"  ఎక్కడ  ?

నేను తిరుపతిలో డిగ్రీ 1st year చదివే రోజుల్లో, అప్పుడు నాకు 18ఏళ్ళు అనుకొంటా, మా నాన్నగారు సత్యవేడు BDO గా పనిచేసేవారు కాబట్టి మా అమ్మ, నాన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు , సత్యవేడు లో ఉండేవారు. నేను కాలేజీ సెలవలు ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళేవాడిని. 

ఒకసారి సెలవలు ఇచ్చినప్పుడు "పండగ కొరకు నీకు, తమ్మునికి బట్టలు తెచ్చిఉంచాను. నీ బట్టలు తీసుకెళ్లి, టైలర్ కు ఇచ్చుకో" అని నాన్నగారు చెప్పారు. నేను కాలేజీ లో చదువుకొంటున్నాను కాబట్టి, నాకు కాస్త ఖరీదైన బట్టలే కొన్నారు. కానీ, తమ్ముడి నిక్కర్ కొరకు తెచ్చిన బ్లూ కాలరు క్లాత్ కాస్త మెరుపుతో, నా బట్టలకన్నా "బాగుంది" అనిపించింది.  
అది చూసి, నాకూ బ్లూ కలర్ లో ప్యాంటు కావాలని నాన్నగారిని అడిగాను. సరే అని, నాకు కూడా బ్లూ కలర్లో ఒక ప్యాంటు బిట్ తెచ్చి ఇచ్చారు. కానీ, అది తమ్ముడి నిక్కర్ క్లాత్ అంత బాగా లేదు. అదే మాట, మా నాన్నగారితో అంటే, "నీవు కాలేజీ లో చదువుకొంటావు కదా, అలా మెరుపు ఉన్న ప్యాంటు వేసుకొంటే బాగుండదు. అదీ కాకుండా, నీకు తెచ్చిన బట్టల క్వాలిటీ, తమ్ముడి వాటికన్నా మంచిది" అని చెప్పారు.  అయినా ఎందుకో నాకు "తృప్తి" కలుగ లేదు. 

మా నాన్నగారికి, తను చిన్నప్పటి ఆర్ధిక పరిస్థితుల వల్ల  చదువుకోలేక పోయానని, తన పిల్లల్లో నేను కాస్త బాగా చదువుకొంటున్నానని, ఇంటి పెద్దకొడుకుని కాబట్టి, నాపై మిగతావారి కంటే అభిమానం ఎక్కువ. అందుకే, ఆ విషయం మాటల్లో చెప్పకపోయినా, ఆయనగారి చేతల్లో కనబడేది.  కానీ ఆ విషయాన్ని, నాకు మెటురిటి  లేనందువల్ల, అప్పట్లో నేను గుర్తించలేక పొయ్యాను.  
ఇప్పుడనిపిస్తోంది, అక్కడ నా బట్టలలో క్వాలిటీ, చక్కదనం ఎక్కువగా ఉన్నా, తమ్ముడి బట్టలతో "పోల్చటం"  వలన నాకు తృప్తి లేకుండా పోయిందేమో కదా?
నిజానికి, దుస్తులు అనేవి మన శరీరాన్ని "కాపాడుకోవటానికి & సదుపయోగపరచుకోవటానికి" మాత్రమే పనికి వస్తాయి. అయితే ఆ  దుస్తులవల్ల మనం వేరే వాళ్ళ దృష్టిని ఆకర్షించాలని, తద్వారా ఒక "గుర్తింపు" పొందాలని అనుకొంటాము కాబట్టే, ఈ అవస్థ అంతా . 

ఈ "పోల్చుకోవటం" అనేది మన  జీవితాల్లో చిన్నా,పెద్దా బేధం లేకుండా అన్ని వయస్సుల వారిలో ఉంటుంది కాబట్టే, మనలో శాంతి  లేకుండా పోతోంది. 
మనదగ్గర ఉన్నవి మనకు సరిపోతాయా, లేదా అని చూడకుండా, ప్రక్కవాళ్ళ దగ్గర ఉన్న వాటికంటే మనదగ్గర ఉన్నవి బాగుండాలనే ఆలోచనతో, వాళ్లకన్నా మనం అన్నివిధాలా ఎక్కువగా "కనబడాలన్న" ఊహ తో మన జీవితాలను చెడగొట్టుకుంటున్న వైఖరి, ప్రతినిత్యం గమనించవచ్చు.  అందుకే  మనకు తాహతు ఉన్నా, లేకపోయినా, ప్రక్కవాళ్ళ దగ్గరవున్నవన్నీ మనం కొంటూ ఉంటాం. 

అది ఏదైనా సరే, మనకు కావలి అనిపించినప్పుడు, అది మనకు "అవసరమా", దాన్ని పొందేందుకు తగిన "అర్హత", భరించే "శక్తి" మనకు ఉందా, దాన్ని పొందటం ద్వారా కలిగే ఆనందం, అది లేక పోవటం వల్ల కలిగే బాధకన్నా ఎక్కువా, అన్నదాన్ని బేరీజు వేసుకొన్నప్పుడు, మనలో మనకే సరైన సమాధానం దొరుకుతుంది. దాని ప్రకారం మనం వెళుతూ ఉంటే, మనకు  కానీ, మన  వలన,   పరులకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. 

కాబట్టి, తృప్తికి మూలం అనేది, మనకు ఏది, ఎంతవరకు అవసరమో అంతవరకే పొందుతూ, ఇతరులతో ఏ విషయం లోనూ మన దగ్గర ఉన్నవాటితో  పోల్చుకోకుండా, మన బ్రతుకు మనకు కావలసిన విధంగా, మనం బ్రతకటం లోనే ఉంటుంది. 
ఏమంటారు?

ధన్యవాదములు 🙏

Where is the "Root" of Satisfaction ?

In my Degree 1st year days; at that time my age may be around18 years, as my father worked as BDO at Satyavedu, my mother, brother and two sisters were staying at Satyavedu. I used to go there during the college holidays. 

"For the festival, I brought clothes for you and your brother. You give your clothes to a tailor, for stitching" said my father, when I once went to my home, during the vacations. 
As I was studying in college, he brought costly cloth material for me. But,when I looked at my brother's blue nikkar cloth, it appeared to be good, with some shining. I demanded blue cloth for myself too. Accordingly, he brought one blue colored pant bit for me. But, I felt that  it was not looking "as good as" my brother's nikker cloth. When I said the same thing to my father, " it would not look nice to wear such a type of shiny pants for a college student. In fact, the quality of your cloth material is superior to your brother's", was his response. However, I didn't feel satisfied at that time.

Due to financial limitations, my father could not study well during his childhood. As I am doing well in education and being the eldest son of our family, my father had special affection for me. This was visible in his deeds, though he never expressed it in words. Due to my lack of maturity at that time, I cannot realise it.

Now I think, though my cloth material was good in quality & apparence, yet due to the act of "comparison" with my brother's clothes, there was no satisfaction in me. 
Actually the clothes are meant to protect and be useful in the utility of our body. But, all this dissatisfaction happens, as we want to derive "recognition" through our clothes by attracting others' attention. 

We can see that the act of "comparison" is there in our lives, irrespective of age, be it young or elders. Hence, the "satisfaction" aspect is missing in our lives. 
It can be observed everywhere that - we are spoiling our lives with an intention to show our "possessions" are better than others and by acquiring them, though they are essential or not to us. That is why we purchase many things, even when they are beyond our financial capabilities.

Whatever it may be, when we aspire to have anything, then we should ask the questions to ourselves like..... whether it is required, do we really deserve it, the feeling of possessing it makes us more happy than not having it, etc. The answers thereby generated in our own self, will guide us appropriately. If we proceed accordingly, then there will not be any problem with our acts, either for self or for others.

So judging properly and acquiring the possessions, to the extent of our requirement and living our lives "without comparing" ourselves with others in any manner, is the root cause of satisfaction.
What do you say?

With regards🙏

===============================
Please click on the below link....................
if you want to see the previous post of this series /  ఈ సిరీస్ లోని ఇంతకు ముందు పోస్ట్ చూడాలనుకొంటే 
if you want to see the next post of this series /  ఈ సిరీస్ లోని తరువాతి  పోస్ట్ చూడాలనుకొంటే 
............Please wait............

=================================

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories