నా లోని "నేను" - 16

 నిన్న అంటే 6.8.2023 ఆదివారం సాయంత్రం 7 గంటలకు, ISKON టెంపుల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్ లో, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్సిబిషన్ జరుగుతోందని, అదీ లాస్ట్ డే అనీ, నాకు తెలిసింది. 
చూసొద్దాం అని వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్లాను. 

అక్కడ స్టాల్స్ అన్నీ చూసుకొంటూ వెళుతుంటే,,,, 
రోటరీ క్లబ్ స్టాల్ లో మన మిత్రులు 👇ముగ్గురు కూర్చొని ఉన్నారు.  

జయచంద్రనాయుడు గారిని నేను రెగ్యులర్ గానే కలుస్తున్నాను. విష్ణుప్రసాద్ గారిని కలిసి చాలా కాలం అయ్యింది. అయితే రవికుమార్ గారిని కలిసి దాదాపు 17 సంవత్సారాల పైనే అయ్యింది అనుకొంటా. నాకు గుర్తుఉండి, ఆయన నిండ్ర బ్రాంచ్ లో పనిచేసేటప్పుడు, బహుశా 2006 లో అనుకొంటా, ఆ బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కు వెళ్లినట్లు గుర్తు. 

జయచంద్రనాయుడు గారు [94924 84003], నేను,, ముదరందొడ్డి బ్రాంచ్ లో 1999 లో అనుకొంటా, కలిసి పనిచేశాము. కానీ, తరువాత రేగులర్గా మేమిద్దరం అప్పుడప్పుడూ  కలుస్తూనే ఉన్నాం. నేను రేణిగుంట లో హెల్పింగ్ హాండ్స్ ఆఫీస్ పెట్టి అక్కడ ఉన్నప్పుడు, ఆయన ఒకరోజు సాయంత్రం అక్కడకు వచ్చి,,  రిటైర్ అయినతరువాత  మా HHF సర్వీస్ అక్టీవిటీస్ లో తను కూడా రెగ్యులర్ గా పాల్గొంటానని చెప్పారు. ఆ  తరువాత అనేక సందర్భాలలో, తిరుపతిలో  మేము కలుస్తూనే  ఉన్నాం.  ఈ మధ్య కొన్నిరోజుల ముందు కూడా, చెన్నై నుంచి నేను ఫోన్ లో రిక్వెస్ట్ చేస్తే, ఈయన  మన HHF విషయంగా ఒక ఎంక్వయిరీ చేసి, నాకు వివరాలు తెలియచేసారు. 

విష్ణుప్రసాద్ గారు [94905 46462], నేను మన గ్రామీణబ్యాంక్ HO క్రెడిట్ డిపార్ట్మెంట్ లో 1990 లో అనుకొంటా, కలిసి పని చేసాము. అప్పట్లో ఢిల్లీ లో ఈయనగారి తమ్ముడు ఉండేవారు. అప్పట్లో  నేను ఒకసారి ఢిల్లీలో FCI లో ఇంటర్వ్యూ కొరకు వెళ్లి, ఆయనను అక్కడ కలిసాను.  ఒకరోజు ఆయన రూమ్ లో ఉండి, ఢిల్లీ లోకల్ టూర్ ను ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుక్ చేసుకొని, వెళ్లి  చూసి వచ్చాను. ఆయన మంచి మల్టీ డైమెన్షనల్ పెర్సొనాలిటీ. సైకిల్ మీద అనేక క్రొత్త ప్రదేశాలు ఎలా చూడవచ్చో, ఆయన ద్వారానే నాకు తెలిసింది. 2016 లో నేను ఒక్కడినే అండమాన్ దీవులకు షిప్ లో సైకిల్ తీసుకొని వెళ్లి, అక్కడ 15 రోజులు ఉండి, వీలైన చోటికంతా సైకిల్ లోనే వెళ్లి, వచ్చేటప్పుడు సైకిల్ ను అక్కడే వదిలి ఫ్లైట్ లో, తిరిగి చెన్నై వచ్చాను. Of course, అక్కడి వాళ్ళు తరువాత సైకిల్ ను  షిప్ లో చెన్నై పంపారు.    

ఇక రవికుమార్ గారి [88018 08464] విషయానికి వస్తే, మేమిద్దరం ఎక్కడా కలిసి పనిచేయలేదు. అయితే రవికుమార్  గారి కుటుంబమో, వారి పెద్దనాన్న గారి కుటుంబమో,  1976 లో మా భవానినగర్ ఇంటి ఒక పోర్షన్ లో రెంట్ కు ఉండే వాళ్ళు. అప్పుడు నేను SGS లో, ఆయన SV ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ చదివే వాళ్ళం. మాటల సందర్భం లో మా నాన్నగారు, రవికుమార్ గారి నాన్నగారు కొలీగ్స్ అని తెలిసింది. 

రవికుమార్ గారు రోటరీ క్లబ్ లో ఆక్టివ్ మెంబెర్ అనీ, ఆ క్లబ్ activitees లో బిజీ గా ఉన్నారనీ తెలిసింది. నాకు సర్వీస్ అక్టీవిటీస్ లో ఇంటరెస్ట్ ఉందని, రవికుమార్ గారు రోటరీ క్లబ్ ఆఫీస్,, మా ఇంటిదగ్గరే incometax ఆఫీస్ ఎదురుగా ఉన్న చెంజి ప్లాజా లో ఉందని చెప్పారు. నేను కుడా ఇకమీదట రోటరీ క్లబ్ సర్వీస్ ఆక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకొంటున్నాను.  

ఇప్పటికి ఇంతే. 
క్రొత్తగా ఎవరైన మన మిత్రులు  కలిస్తే,, ఆ వివరాలతో మీ ముందుకు వస్తాను. 

మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [94911 35998]   

గమనిక: మన గ్రామీణబ్యాంక్ వాళ్ళవి మూడో నాలుగో WhatsApp గ్రూప్స్ ఉన్నట్లు ఉన్నాయ్. ఈ బ్లాగుపోస్టు లింక్ ను మీరు మెంబెర్స్ గా ఉన్న అన్ని గ్రూప్స్ లో ఫార్వర్డ్  చేస్తే బాగుంటుంది. 
ఈ మధ్యనే, BN నాగేశ్వర్ రావు గారు ఎదో గ్రూప్ లో నా బ్లాగుపోస్టు చూసి, "very nice bhayyaa" అని ఆ బ్లాగుపోస్టు లోనే మెసేజ్ పెట్టారు. BNR గారు, నేను,, మన బ్యాంకు HO  లో చాలా కాలం కలిసి పనిచేశాము. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో టచ్ లో లేను. ఆయన గారి మెసేజ్ చూసిన తరువాత నాకు చాలా సంతోషం కలిగింది. 

నేను HO లో దాదాపు 15 సంవత్సరాలపాటు, క్రెడిట్, TME Cell, ఇన్స్పెక్షన్ , విజిలెన్స్ లో అనేక క్యాడర్ లలో  పనిచేసి, చిత్తూర్ జిల్లా లోని  అన్ని  బ్రాంచెస్ కు తిరగటం వల్ల, మన బ్యాంకు పాతతరం స్టాఫ్ లో చాలామంది నాకు, నేను చాలా మందికి తెలుసు
అయితే, 2009 లో నేను బ్యాంకు జాబ్ కు "RESIGN" చేసి వెళ్ళిపోవటం వల్ల, చాలా మందితో, చాలా కాలం గా, టచ్ లో లేను. ఈ బ్లాగుపోస్టు లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి, ఈ బ్లాగుపోస్టు లో చూసిన  అప్పటి నా మిత్రులకు, ఇప్పటి నా పరిస్థితి తెలిసి, నన్ను కాంటాక్ట్ చెయ్యటం వీలవుతుంది. అందుకే, నా బ్లాగుపోస్టు లింక్ ను మన గ్రామీణ బ్యాంకు వాళ్ళు మైంటైన్ చేస్తున్న అన్ని గ్రూప్ లకు ఫార్వర్డ్ చెయ్యమని విన్నపము. 🙏


Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories