నా లోని "నేను" - 26

నిన్న అంటే 21.8.2023 ఉదయం మన పుత్తూరు ఫ్రెండ్, కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేస్తే, ఈ నెల 25,26,27 తేదీలలో పుత్తూరు లో తిరునాళ్ళు జరుగుతాయని, మన ఫ్రెండ్స్ చాలా మందిని కలవాలంటే ఇది మంచి అవకాశం అని, నన్ను పుత్తూరు కు రమ్మని చెప్పారు.

నాకు కూడా మన పాత ఫ్రెండ్స్ ను కలిసేందుకు ఇది మంచి అవకాశంగా కనబడింది. 
ఇంతలో నాకు మన ఫ్రెండ్ BS Verma గారు గుర్తుకు వచ్చారు. ఆయన ఈ మధ్యనే, నాతో చాలాసేపు ఫోన్ లో, మన పుత్తూరు జ్ఞ్యాపకాలగురించి మాట్లాడారు. తిరుపతికి గానీ, పుత్తూరు కు గానీ వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారు. అందుకని అయనకు ఫోన్ చేసి, పుత్తూరు తిరునాళ్ల విషయం చెప్పాను. అంతకు ముందే కృష్ణారెడ్డిగారు తనకు ఫోన్ చేశారని, అయితే ఇప్పుడు తాను తిరుపతిలో గోల్డెన్ తులిప్ హోటల్ లో  ఉన్నానని చెప్పారు. 

ఫ్రీగానే ఉన్నానని చెబితే, నేను హోటల్ కు వెళ్లి వర్మ గారిని కలిసాను. వర్మ గారు, ఆయన సతీమణి గారు కోడూరు లో ఒక పెండ్లి అటెండ్ చేసి, వాళ్ళ పెద్దబ్బాయి కొరకు తిరుపతి హోటల్ లో వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి లో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ పెండ్లి చూసుకొన్న తరువాత అందరూ బెంగళూరు వెళ్ళిపోతారంట. 

1974 లో కలిసి చదువుకొన్న తరువాత, మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. అంతకు వారం ముందు ఫోన్ లో మాట్లాడి ఆయన వాట్సాప్ లో  పంపిన ఫోటో చూడకుండా ఉంటే, ఎదురెదురుగా ఉన్నా, గుర్తుపట్టే ప్రస్తక్తే లేదు కదా. 50 ఏండ్ల తరువాత, మధ్యలో కలవకపోతే  ఎలా గుర్తు పట్టగలం? 


వర్మ గారు డిగ్రీ చేసిన తరువాత IOB బ్యాంకు లో పనిచేసి, 2015 లో VRS తీసుకొన్నారంట. బెంగళూరు లో స్వంత ఇంటిలో ఉంటున్నారంట.  ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయికి పెండ్లి అయ్యింది. 

ఆరోగ్యం, మిగతా అన్ని విషయాలలో పైవాడి దయవల్ల అంతా  బాగుందని, జీవితం ప్రశాంతంగా సాగిపోతోందనీ చెప్పారు. 

దాదాపు ఒక గంట పాటు అనేక విషయాలు మాట్లాడుకొని , పాత జ్ఞ్యాపకాలను గుర్తు చేసుకొన్నాం. 
వర్మ గారి ఫోన్ నెంబర్: 82974 47828. 

ఇప్పటికింతే. 
మరిఒక మిత్రుణ్ణి తొందర్లో కలసి, ఆ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. 
అంతవరకూ శెలవు. 

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నసీర్. 
94911 35998

గమనిక:
మన పుత్తూరు ఫ్రెండ్స్ అందరికీ, ఈ బ్లాగుపోస్టు లింక్ పంపండి. 
నేను ఈ నెల 26వ తేదీ, శనివారం ఉదయం 11 గంటలకు పుత్తూరు చేరి, సాయంత్రం 4 గంటల వరకు అక్కడ, కృష్ణారెడ్డిగారి తో కలసి, అక్కడి మిత్రులను కలవాలని అనుకొంటున్నాను. వివిధ ప్రాంతాలలో ఉన్న మన మిత్రులు ఈ నెల 25వ తేదీన పుత్తూరుకు వస్తే, మనం కలసి, మన పాత జ్ఞ్యాపకాలను నెమరువేసుకోవచ్చు కదా!!  
   

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories