నా లోని "నేను" - 18
నిన్న అంటే, 10.8.2023 ఉదయం 11.30 ప్రాంతం లో తిరుపతి లో మన రిటైర్డ్ SGB స్టాఫ్ రన్ చేస్తున్న society లోకి వెళ్లాను. అక్కడ సుబ్రమణ్యం రెడ్డిగారు నన్ను చూసిన వెంటనే, చాలా సాదరంతో ఆహ్వానించారు.
సుబ్రహ్మణ్యం రెడ్డిగారి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చి, తప్పనిసరిగా ఈ నెల 19వ తేదీన నన్ను తిరుపతిలోనే ఉండేటట్లు ప్లాన్ చేసుకొని, రిసెప్షన్ కు రావలసిందిగా ఆహ్వానించారు.
ఇది ఒకవిధంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే, అక్కడికి ఆరోజు, చాలా మంది మన బ్యాంకు మిత్రులు వస్తారు కాబట్టి, వారిని కలిసే అవకాశం ఉంటుంది కదా.
అక్కడ ఉన్న మన మిగతా మిత్రులను కవర్ చెయ్యాలని ఈ క్రింది వీడియో తీసాను.
క్రొద్ది సేపటి తరువాత నరసింహారెడ్డి గారు అక్కడికి వచ్చారు. వీరిని చూసి చాలా కాలం అయింది. ఈయన, నేను, శివారెడ్డిగారి పీరియడ్ లో శ్రీకాళహస్తిలో పనిచేశాము. అప్పటి సంగతులు గుర్తుచేసుకొంటూ,కొంత టైం పాస్ చేసిన తరువాత, ఆఫీస్ క్లోజ్ చేసి బయలు దేరేముందు, ఈ ఫోటో తీశాను. 👇ఇందులో నరసింహారెడ్డి గారిని, మాధవరెడ్డిగారిని, శివారెడ్డిగారిని, మునికృష్ణారెడ్డిగారిని, సుబ్రమణ్యంరెడ్డి గారిని, శివశంకర్ గారిని చూడొచ్చు.
మాధవరెడ్డిగారు, బ్లాగ్ అంటే ట్విట్టర్ లాంటిదేనా అని అడిగారు.
బ్లాగ్ అంటే, ఒక డైరీ లాంటి ఆన్లైన్ రికార్డు అని నా ఉద్దేశం. దీంట్లో మన ఫోటోలు ఉంచి, అప్పటి సంగతులను రికార్డు చేసి పెట్టుకొంటే, భవిష్య్తతు లో వాటిని చూసుకొంటూ, కాలక్షేపం చెయ్యవచు. ఇది ఒక లింక్ లాగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ స్పేస్ కుడా occupy చెయ్యదు.
ఇప్పటికింతే. మరికొన్ని క్రొత్త సంగతులతో, మరోసారి కలుస్తాను.
ధన్యవాదములు,
అబ్దుల్ నసీర్ [94911 35998]


Comments