నా లోని "నేను" - 22

My dear Friends,
Greetings to you all. 

ఇంకొన్ని రోజులలో నేను 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని, 65వ సంవత్సరం లోకి ఎంటర్ అవుతున్నాను. 
నా క్లాస్మేట్స్, రిటైర్ అయిన నా  EX. కొలీగ్స్, అందరూ ఒకటీ రెండు సంవత్సరాలు, అటూ ఇటూగా, ఇదే ఏజ్ గ్గ్రూప్ లోనే  ఉంటారు కదా! 

60 సంవత్సరాల తరువాత, ఒక విధంగా మనము బోనస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్లు. 
బాధ్యతలు తీరిపోయి, చిన్నవో, పెద్దవో ఆరోగ్య సమస్యలతో, టైంపాస్ ఎలా చెయ్యాలో తోచక కొట్టుమిట్టాడు పరిస్థితి. 

నాకు తెలిసి ఒక్కరో, ఇద్దరో క్రొత్త ఉద్యోగం లో చేరటమో, స్వంత బిజినెస్ లోనో, స్వంత వ్యవసాయం లోనో,, బిజీ గా వుంటున్నారు.  మిగతా మిత్రులందరూ, ఉంటే మనమలతో ఆడుకోవటం, సంతానం దూరంలో ఉద్యోగాలు చేసుకొంటూ వుంటే, వీళ్ళు స్వంత ఊళ్లలో మిత్రులతో కబుర్లాడుకొంటూ టైంపాస్ చేస్తున్నారు. 

నేను కూడా చెన్నై లో,  నా మానమరాలితో ఆడుకొంటూ టైంపాస్ చేస్తున్నాను. అయితే, ఆ పాప ఇప్పుడు యూకేజీ లో చేరి స్కూల్ కు వెళుతోంది. ఉదయం 8గంటలకంతా బయలుదేరి వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రానికి రావటం తో, ఈ మధ్య నాకు చెన్నైలో  టైంపాస్ ఎలా చెయ్యాలో తెలీక, తికమక గా ఉంటోంది. అందులో చెన్నై లో మన మిత్రులెవరూ లేరు. అదీగాక తమిళం నాకు రాదు. అందుకని, నేను నా భార్య తిరుపతి లో ఉన్న మా ఇంటికి వచ్చి చేరాము. 

ఇక్కడ తిరుపతి లో  ఏంచేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే, చాలా కాలం క్రితం, అంటే కరోనా టైం లో నేను CREATE చేసుకొన్న "బ్లాగ్" గుర్తుకొచ్చింది. 
బ్లాగ్ ను డైరీ మాదిరి వాడుకొంటే, అంటే మన భావాలకు అక్షర రూపం ఇచ్చి, మనకు తోచింది వ్రాసుకొంటూ ఉంటే, మంచి టైంపాస్ అవుతుంది కదా అనిపించింది. 

ప్రస్తుతం, ఈ "నా" బ్లాగుపోస్టుల ముఖ్య ఉద్యేశ్యం ఏమిటంటే,,,,,
నా మిత్రులను తీరికగా కలవటం, వారితో నాకున్న అనుబంధాన్ని, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం, కొంతసేపు మాట్లాడుకున్న తరువాత ఒక ఫోటో తీసుకోవటం, ఈ విధంగా బ్లాగుపోస్టు లో రికార్డు చేసి ఉంచుకొని, భవిష్యత్తులో, ప్రస్తుతం రికార్డు చేస్తున్న బ్లాగుపోస్టు  జ్ఞ్యాపకాల దొంతరోలో నుంచి ఒక్క్కోక్కటీ తీసి  "నెమరు వేసుకోవటం". 

నాతోపాటు, నా మిత్రులకు కుడా టైంపాస్ అవ్వాలనే ఉద్యేశం తో, నా బ్లాగుపోస్టు లింక్ లను, నా స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, EX. కోలీగ్స్ వాట్సాప్ గ్రూప్ లలో సెపరేటేగా పోస్ట్ చేస్తూ వస్తున్నాను. 

ఇప్పడు నా మిత్రులందరికీ ఉపయోగపడే విషయం ఒకటి కవర్ చెయ్యాలని అనుకొన్నాను. 
అదేమంటే నిన్న, అంటే 13.8.2023 ఆదివారం సాయంత్రం తిరుపతి రోటరీక్లబ్ వాళ్ళ వీక్లీ మీటింగ్ కు  అటెండ్ అయ్యాను. రోటరీ క్లబ్ సెక్రటరీ, మా EX.కొలీగ్ రవి కుమార్ గారు. నన్ను రోటరీ క్లబ్ మీటింగ్ కు అతిధిగా అందరికీ పరిచయం చేసి, వేదిక మీద కూర్చోపెట్టారు.
 

 ఈ మీటింగ్ లో RC కృష్ణస్వామి రాజు గారి "పర్సనాలిటీ డెవలప్మెంట్" ఉపన్యాసం ఉండింది. ఈ వయస్సులో మనకు పనికివచ్చే విషయాలు ఏముంటాయిలే అనుకొన్నాను కానీ,  రాజు గారి ఉపన్యాసం లో  యువకులకే కాకుండా, మనలాంటి వారికి కూడా ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. 
మచ్చుకు, హెల్త్, వెల్త్, కాంఫిడెన్స్, పాజిటివ్ ఆటిట్యూడ్, మొదలైన వాటి అవసరం, వాటిని ఎలా మైంటైన్ చెయ్యాలి, అనేవిషయాలు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. 

అన్నట్టు RC కృష్ణస్వామిగారు నన్ను ఎక్కడో చూసారని, గుర్తుకు రావటం లేదనీ అన్నారు. ఆయనను ఎక్కడ చదివారని అడిగినప్పుడు, పుత్తూరు లో 10వ తరగతి 1976 బ్యాచ్ అన్నారు. నేను పుత్తూరు లో 10వ తరగతి 1974 బ్యాచ్. బహుశా అప్పటి జ్ఞ్యాపకం ఉండొచ్చునేమో. 

నా గురించి చెప్పమంటే, నేను గ్రామీణబ్యాంక్ లో పనిచేసి RESIGN చేసిన సంగతి, హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ను 2011 లో రిజిస్టర్ చేయించి, అప్పటినుంచి  చేస్తున్న కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించాను.  


ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఒక యువకునికి నా ద్వారా ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇప్పించారు. 

మీటింగ్ అంతా అయిన తరువాత, రోటరీ క్లబ్ సెక్రటరీ, శ్రీ రవికుమార్ గారు నన్ను రోటరీ క్లబ్ లో చేరవలసిందిగా కోరారు. నాకూ ఇలాంటి సర్వీస్ ఆక్టివిటీస్ మీద ఇంట్రస్ట్ ఉంది కాబట్టి, రెండు మూడు మీటింగ్స్ అటెండ్ అయిన తరువాత ఆలోచిస్తానని చెప్పాను. 
 
ఇప్పటికింతే. మరికొన్ని క్రొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. 

మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్ [94911 35998]

గమనిక: తిరుపతి రోటరీ  క్లబ్ లో, సమాజ సేవ చెయ్యాలని అనుకునే వారికి, మంచి అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్లాగుపోస్టు లింక్ ను మీ మిత్రుల వాట్సాప్ కు ఫార్వర్డ్ చేసి, వారందరికీ  తెలియచేయండి. 

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories