నా లోని "నేను" - 27 [Helping]

నేడు నేను విన్న "మంచి" మాట
👇👇👇👇👇👇👇👇👇
మనం తిన్న మంచి "తిండి", మరో పూటకు అరిగిపోతుంది. 
మనం కొన్న మంచి "బట్ట", మరో సంవత్సరానికి చినిగిపోతుంది. 
కానీ ...... 
మనం చేసిన మంచి "పని", మన సృష్ఠికర్త దగ్గర ఉన్న,, మన లెక్కలో  వ్రాయబడుతుంది. 
అంటే, మనం ఇతరులకు చేసిన "మంచి" శాశ్వతం అన్నమాట. 

👆పై మాటలు నేను "జీవనవిద్య" ఆదివారం(27.8.2023) రిఫ్రెషర్ కోర్స్ సెషన్ లో రికార్డు చేసిన వీడియో లో విన్నాను. 

ప్రతీ ఆదివారం, ఉదయం 7గంటలనుంచి, 8.30 వరకు ఈ online zoom క్లాస్ (free for all)ఉంటుంది. 
నేను సాధ్యమైనంత వరకు ప్రతీ ఆదివారం ఈ జూమ్ మీటింగ్ కు అటెండ్ అవుతాను. అలా అటెండ్ కాలేకపోతే, YouTube లో CHDHC వాళ్ళు  upload చేసిన వీడియోలో చూస్తాను/వింటాను.   

ఇక్కడ మంచి పని అంటే, మన వలన ఇతరులకు మంచి జరగటం అన్నమాట. 
అది మన ద్వారా ధన సహాయం కావచ్చు, మాట లేదా చేత సహాయం కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, అదీ లేకపోతే మన మాటల ద్వారానో,  చిరునవ్వు ద్వారానో  ఇతరుల మనోభావాలను ఉత్తేజపరచడం కావచ్చు.   
ఐతే, ఇలా ఇతరులకు మంచి, సేవ, సహాయం చేసినందువలన మనకు జరిగే "వ్యక్తిగత" లాభం గానీ, అభివృధి ఏమిటి?? 
అదేమిటంటే, ముఖ్యంగా మన లోపల మనకు, 
మనం ఇతరులకు ఉపయోగపడ్డాం అనే "ఫీలింగ్" కలుగుతుంది.
మన దగ్గర ఉన్నదే మనం ఇతరులకు ఇవ్వగలం కాబట్టి, 
మన దగ్గర ఇతరులకు ఇవ్వగలిగినవి చాలా ఉన్నాయన్నా విషయం తెలిసివస్తుంది.  
దీనివలన మనలో "self-confidence" పెరుగుతుంది. 
అంతకన్నా ముఖ్యంగా మన మీద మనకు ప్రేమ, 
ఇతరులకు మనమీద గౌరవం పెరుగుతాయి. 
అన్నీ కలసి, మన లోపల "ఆనందం/సంతోషం" గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. 
అంటే, మానవుల అంతిమ లక్ష్యం అయిన "continuous Happiness" కు దారి కనబడినట్టే కదా!! 

So, మన నిరంతర ఆనందానికి దగ్గర దారి,, 
ఇతరులకు సహాయం చెయ్యటమే అన్నమాట. 

ప్రతీ మనిషి దగ్గర,,,,
ఇతరులకు ఏదో ఒక విధంగా సహాయం చెయ్యగల సత్తా, 
చేసేందుకు తగిన అవకాశం ఉంటుంది. 

అయితే, మనం ఇతరులకు సేవ గానీ, సహాయం గానీ చెయ్యకుండా,,, 
మనలను ఆపుతున్నదేమిటి?  

ఆలోచించండి. 
మీ ఆలోచనలను నాతో, క్రింది కామెంట్స్ లో  కానీ, 
వాట్సాప్ [9491135998] ద్వారా కానీ పంచుకోండి. 
నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 

ఇప్పటికి ఇంతే. 
మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు త్వరలో వస్తాను. 

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నసీర్. 

గమనిక: పై విషయాల గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకునే వారు, ఈ క్రింది లింక్ ద్వారా YouTube లో ఉన్న వీడియో చూడవచ్చు. 

Comments

Uma Paidi pally said…
Hi,mi vidios chusthe chaala baganipisthadi.Konni reasons ,intlonchi vellaleka povadam,pillalni pampiddamante distance samasya,ela start cheyyali ,ekkada star cheyali theliyaka povadam,ivanni reasonse.Mi vidios chaala inspirayionalga vuntayi.

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories