నా లోని "నేను" - 28 (??)

ఈ "నా లోని నేను" శీర్షిక ద్వారా నేను చెయ్యాలి అనుకున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి??

నా అంతరంగ భావనలకు అక్షర రూపం ఇద్దామని ప్రారంభించాను.
అంతవరకు బాగానే ఉంది.
అయితే, నేను వ్రాసింది అందరూ చదవాలని, అందుకు తగ్గట్టుగా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని వ్రాయటమే బాగా లేదు అనిపిస్తోంది.

అయితే, నేను వ్రాసింది ఇతరులు చదవకపోతే వచ్చే నష్టం ఏమిటి? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే...
ఏమీ లేదు అనిపించింది.
"అటువంటప్పుడు ఎందుకు వ్రాయాలి?" అనే ఇంకో ప్రశ్న!!

"ఇది నా టైంపాస్ కొరకు మాత్రమే",
"ఇతరుల మెప్పు కొరకు కాదు"....
అన్న నా మనస్సు చెప్పిన సమాధానం, 
కొంత వరకు స్వాంతన ఇచ్చింది.

నా భావ పరంపరను ఇతరుల వద్దకు చేర్చటం,
వారు పట్టించు కున్నా, పట్టించుకో కున్న,,,
ముందుకు సాగటం మంచిదని అనిపిస్తోంది.

అందుకే, ఇక ముందు ఈ blogposts ద్వారా నా భావాలను మీతో పంచుకొంటూ ఉంటాను.
మీరు ప్రతిస్పందిస్తూ, నన్ను ప్రోత్సహిస్తే మంచిది.

ఈ blogpost ను చూసిన మీకు ధన్యవాదములు.
🙏
మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్.

Comments

Al-hamdulilla bhai

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories