"I" in me / నా లోని "నేను" - 8

                                                [English Version follows the below Telugu Version]
         ఆలోచించి తీసుకొన్న "సాహసోపేతమైన నిర్ణయాలు" తృప్తిని ఇస్తాయి 

ఈ సంవత్సరం జనవరి నెలలో, నేను, నా భార్యా, తిరుపతి గ్రామీణ బ్యాంకు శాఖలో లాకర్ ఆపరేట్ చెయ్యటానికి వెళ్ళాము. అప్పుడు అక్కడ పనిచేస్తున్న ఒక యంగ్ లేడీ ఆఫీసర్ నాతో "సార్, నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలనుకొంటున్నాను, ఏమీ అనుకోకండీ.  మీరు మంచి సీనియారిటీ పోసిషన్ లో, ఫాట్ సాలరీ తీసుకొంటూ ఉన్నా, బ్యాంకు జాబ్ కు రిజైన్ చేసి వెళ్ళారంట కదా !, ఎందుకు?" అన్నారు. 

ఏమి జవాబు చెబితే బాగుంటుందా అని నేను ఆలోచిస్తూ ఉంటే, నా ప్రక్కనే ఉన్న నా భార్య, "ఆయనకు ప్రజాసేవ అంటే ఇష్టం. అందుకు," అని చేప్పారు. అవును అంటూ తలవూపి, "నాకు ఆ లైఫ్-స్టైల్  నచ్చలేదమ్మా" అని చెప్పాను. 

అలా ఆ లేడీ ఆఫీసర్ అడగటం, నా భార్య "ఆ" విధంగా సమాధానం చెప్పటం, నాకు ఒకవిధమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. 
ఎందుకంటే, నా జాబ్ రెసిగ్నషన్ నిర్ణయం విన్న తరువాత ఎక్కువ భయపడింది & టెన్షన్ ఫీల్ అయ్యింది నా భార్య. అది సహజం కూడా. 
పది సంవత్సరాల వరకు మనం ఏ విధమైన ఇబ్బంది లోకుండా ఉండటానికి నేను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొన్నాను, ఈ లోపల మన అబ్బాయి ఏ విధంగా చేతికి అందివస్తాడో,, అన్నీ వివరంగా చెప్పినా "అప్పట్లో" లాభం లేక పొయ్యింది. పాపం ఆమెకు ఉండే భయాలు ఆమెకు ఉంటాయి కదా.  

2008 సంవత్సరంలో  నేను తీసుకొన్న ఆ "జాబ్ రెసిగ్నషన్" అనే  సాహసోపేతమైన డెసిషన్ వల్లనే, ఈరోజు నేను అన్నివిధాలా ఆరోగ్యంగా, నా కుటుంబం అంతా "ఆనందం" తో ఉండగలుగుతున్నాము,,,,,,, అనేది, మా కుటుంబ సభ్యులందరి అభిప్రాయం. ఎందుకంటే, జాబ్లో లేనన్దు వల్ల నాకు తిరుపతిలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే, అవసరం అనిపించి, మా సంసారాన్ని తిరుపతి నుంచి చెన్నై కు మార్చగలిగాము. అలా చెన్నై లో ఉంటూ, మా అబ్బాయికి అన్ని విధాలా తోడుండి మోటివేట్ చెయ్యటం వల్లే, అతను 2016లో క్లిష్టమైన చార్టెడ్ అకౌంటెంట్  కోర్సు ఫైనల్ పరీక్ష  పాస్ కాగలిగాడు. చెన్నై లోనే EY అనే మంచి ఇంటర్నేషనల్ అకౌంటింగ్ సంస్థలో ఉద్యోగం సంపాదించగలిగాడు. అతనికి మంచి ఉద్యోగం ఉంది కాబట్టి, మాకు తెలిసిన వాళ్ళు పెండ్లి సంబంధం కొరకు మమ్ములను సంప్రదించారు.  ఒక మంచి అమ్మాయితో  మా అబ్బాయి పెండ్లి,  మేము చేయగలిగాము. ఇప్పుడు 4 సంవత్సరాల మా ముద్దుల మానమరాలితో నేను, నా భార్య ఆనందంతో ఆడుకోగలుగుతున్నాము. 

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మనం అన్ని విధాలా ఆలోచించి తీసుకొనే "సాహసోపేతమైన నిర్ణయాలు", భవిష్యత్తు లో ఖచిత్తం గా మనకు సంతృప్తిని ఇస్తాయి, అనేందుకు ఇదే  ఒక సజీవ ఉదాహారణ.  
ఇలాంటి నిజ జీవిత సంఘటనలు, నా జీవిత ప్రయాణం లో ఎన్నో చూసాను.  
1. మా చిన్న బావగారు, ఢిల్లీలో ప్రశాంతంగా చేసుకొంటున్న ఉద్యోగాన్ని వదిలి, బాంబులతో దద్దరిల్లుతోన్న ఆఫ్గనిస్తాన్ లో ఉండి , భారత దేశం తరఫున పనిచేయటం,
2. మా ఫ్రెండ్ ఒకాయన  రైల్వేస్ లో చాలా పెద్ద పోసిషన్ లో చేస్తున్న మంచి ఉదోగాన్ని భయపడుతూ వదిలి, త్రివేండ్రం ఇస్రో లో చేరి, తరువాత కాలంలో Dr. APJ Abdul Kalaam గారి దగ్గర పనిచేసి, Sr Scientist గా రిటైర్ అవ్వటం,,
3. కొంతమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మంచి జీతాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదిలి, వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యటం,,,
ఇలా ఎన్నో. 

మన దినవారీ జీవితం అస్తవ్యస్తం గా ఉండి, మనకు తృప్తిని ఇవ్వనప్పుడు, మనకు కావలసినది ఏమిటో కనుగొని, దానికొరకు ఏమిచేయాలో "అది" చెయ్యగలిగితే, మన జీవన ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది. 

అయితే , దీనికొరకు మనం కంఫర్ట్-జోన్ నుంచి బయటకు వచ్చే "సాహసం" చేయగలగాలి. ఇలా చెయ్యటం వలన మనకు ఎదురైయ్యే కష్టనష్టాలను, అవమానాలను ఎలా ఫేస్  చేయ్యాలో కుడా, ముందే ఆలోచించుకొని, దానికి సంసిద్దులం కావాలి.  ఎందుకంటే, లోకరీతికి భిన్నంగా మనం నడవాలనుకొన్నప్పుడు, విమర్శలను, కష్టాలను ఎదుర్కొనక తప్పదు కదా. 

నిజానికి మనం ఏదైనా "సాహసం" చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏదైనా చెడు జరిగితే ఎట్లా అనుకొంటూ, ఆ పనిని వెంటనే వదిలివెయ్యటమో "లేకపొతే",,,,,, 
పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చూద్దాంలే అని "వాయిదా" వేస్తూ పోవటమో చేస్తాము. 
అలా కాకుండా, అన్ని విధాలా ఆలోచించి, తగిన జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు పొతే, మనం తీసుకొన్న సాహసోపేతమైన నిర్ణయాలు ఖచ్చితంగా మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. కావాలంటే, మీ జీవితం లో ఇంతకు ముందు "మీరే" చేసిన సాహసాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 

యూవతారానికి ఇందుమూలం గా నేను చెప్పాలని అనుకొన్నది ఏమంటే..... 
ఒకవేళ మీ ప్రస్తుత లైఫ్-స్టైల్ మీకు "నచ్చకపోతే",,,,,,,   
అన్ని విధాలా అలోచించి, ఒకటికి రెండు ప్రణాళికలు వేసుకొని [ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి రెడీగా ఉండేటట్లు] ఒక సాహసవంతమైన నిర్ణయం తీసుకొని, దానిని అమలు చేస్తూ ముందుకు వెళ్ళండి.  
అనుకొన్నది అనుకున్నట్లు జరిగితే "ఆనందం", లేకపోతే "అనుభవం",, వస్తుంది. 
తద్వారా మీ జీవితం రొటీన్ కు భిన్నంగా, ఉత్సాహం తో ముందుకు సాగుతుంది. 
అట్లా కాక సర్దుకుపోతే,, 
లేచామా, తిన్నామా, పడుకొన్నామా, అన్న చందాన రోజులు గడిచిపోతాయి. 

నేటి మన నిర్ణయాలే, రేపటి మన భవిష్యత్తు ను నిర్ణయిస్తాయి. 
ఏమంటారు?

మీ శ్రేయోభిలాషి 🙏

Daring Decisions leads to SATISFACTION

In the month of January of this year, my wife & I visited Tirupati Grameena Bank Branch to operate our Locker. There, one young lady officer approached us and said “Sir, I would like to ask one question. Please don’t think otherwise. Why did you resign from our bank job, as you were enjoying a good position and fat salary?” 

While I was thinking what to say, my wife present beside me told her that “He is interested in social service. Hence he resigned from the Bank job”. By nodding my head in agreement, I said “that life-style not suited to me”.

 

Questioning of that lady officer and the reply of my wife "in that way" made me feel happy & serene.

Because, my wife was the person, who felt tension and feared about our future, when I announced my resignation decision. It is natural too.

My clear explanations about my plans & precautions for our comfortable life, for the next 10 years and how our son will take care of our remaining life etc., could not make her relax.

 

All my family members agree with me,,,, 

Because of my daring decision taken in the year 2008, now I am healthy and all of us are living happily. Why because, since I was not working at that time, there was no need for our stay in Tirupati. Hence, to help our son, we could shift our family from Tirupati to Chennai. Due to our constant motivation and timely support, he could pass the difficult Chartered Accountant Final exams in the year 2016 and succeeded in getting a job in EY, a reputed multinational firm in Chennai. As he is holding a fat-salaried job, our family friends consulted us for his marriage alliance. We could perform his marriage with a good girl. Now my wife & myself are happily playing with our 4 years old granddaughter.

 

The purpose behind narrating the above is to show that – 

This is a live example explaining how the PAST calculated courageous decisions, resulting in a satisfied PRESENT & future.

I witnessed many such live examples in my life.

1. My younger brother-in-law, who was in a good job at Delhi left it and went to dangerous Afghanistan to work in the Indian Government's job.

2. One of my friends, who held a good position in Railways, left that job and joined ISRO Trivandrum, worked with Dr. APJ Abdul Kalam ji and retired as a Sr. Scientist.

3. Some soft-ware professionals are leaving their fat-salaried jobs and starting their own businesses.

Like this, there are many example


When our daily life is not moving in a satisfying way, then we should try to find what has to be done to make it happy and by adopting it courageously, everything will be alright.


For this, first we need to come out of our comfort-zone. Be ready to face the problems. Because, when we want to do something "different from the routine", then we invariably face problems, criticisms, hurdles, etc.


Actually, when we intend to be involved in any adventure, then due to fear of failure/problems, we may LEAVE the proposal itself before the beginning of it, or postpone the implementation part, with an intention to wait for suitable circumstances.

Instead, by proceeding courageously forward by taking calculated risks, the outcome will definitely give us satisfaction, in due course of time. Just recall your own brave acts of the past to realize this.


I would like to suggest the younger generation …….

If you do not like your present clumsy life-style…

Then think, have two or three plans [in case of failure, next plan can be implemented], take a daring decision and plunge into action by implementing it.

If everything happens as desired then you will feel happy. Otherwise, you will get experience.

With this, your life will move forward with enthusiasm.


If you want to compromise with the present circumstances, 

then there will be no change in the boring life with routine schedules.


Our today’s decisions will decide our tomorrow/future.


What do you say, my dear?


with regards🙏

================================
Please click on the below link....................
if you want to see the previous post of this series /  ఈ సిరీస్ లోని ఇంతకు ముందు పోస్ట్ చూడాలనుకొంటే .......
if you want to see the next post of this series /  ఈ సిరీస్ లోని తరువాతి  పోస్ట్ చూడాలనుకొంటే ........
............Please wait............

================================

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories