Nagari friends get-together

మై డియర్ మిత్రులారా!
అందరికీ వందనం. 

29.11.2024, శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతం లో క్రింది ఫొటోలో ఉన్నవారు, నగరి పట్టణానికి 11 KM దూరం లో మన మోహన్ రాజు గారి తోటలో కలవటం జరిగింది. 


1. రఘుపతి,

2.  నటరాజన్ 

3. వెంకటేశ్వరులు 

4. రవి 

5. జ్యోతి నాయుడు

6. మోహన్ రాజు 

7. మోహనరాజు గారి స్నేహితుడు 

8.  నాగరాజబాబు (పోలీస్ )

9. కైలాసం 

10. అబ్దుల్ నసీర్ 

11. విజయ్ కుమార్ 

12.  విజయ బాబు 

13. బాబు (రొక్కం)

14. మనోహర్ 

15.. మునిరత్నం రెడ్డి. 

16. వీరాస్వామి 

17. జయరాం 


మేఘావృతమై, ఆహ్లాదకరమైన, మంచి వాతావరణం లో, మధ్యాహ్నం విందుచేసుకొన్నాం. 




ఈ సందర్భాన్ని "స్పాన్సర్" చేసిన "USA  రవి" గారికి మరియు మిగతా మిత్రులకు ధన్యవాదాలు. . 
 
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఉదయం 6 గంటలకు పిచ్చాటూరు వెళ్ళటం మరియు ఇతర arrangements  కొరకు  మన నగరి బాబుగారు పడ్డ కష్టం, నేను దగ్గరుండి చూసాను. బాబు గారికి ప్రత్యేక అభినందనలు. 

తన కొబ్బరితోటలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి ఉత్సాహంగా ముందుకు వచ్చిన మోహన్ రాజు గారికి కృతఙ్ఞతలు. 

వాన రావచ్చేమో అనే సందేహం తో  కొంతమంది మితృలు రావాలని ఉన్నా,, రాలేదు. కానీ, ధైర్యం చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు. 

ఈ కార్యక్రమం లో పాల్గొనటానికి వచ్చిన నాకు, తన ఇంటిలో బస, భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేసి, నా అవసరాలు అన్నీ తీర్చిన బాబు గారికి ఋణపడి ఉన్నాను. 

చివరగా, చెన్నై లో ఉంటున్న విజయకుమార్ గారు, తన కారులో నన్ను చెన్నై లో ఉంటున్న మా ఇంటిదగ్గర దించారు.  ఆ టైంలో అంటే రాత్రి 8 గంటల టైములో  బాగా అలసిపోయి ఉన్నా, హెవీ ట్రాఫిక్ ఉన్నా, వర్షం పడుతున్నా లెక్కచెయ్యకుండా, నన్ను మా ఇంటిగేటు దగ్గర క్షేమంగా చేర్చిన విజయకుమార్ గారికి నా మనఃపూర్వక కృతఙ్ఞతలు. 

దాదాపు 50 సంవత్సరాల తరువాత, కొంతమంది మిత్రులను నేను కలవటం, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వీలున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకొంటే, సీనియర్ సిటిజెన్స్ ఐన మనకు మంచి టైంపాస్ అవుతుంది కదా! 

ఇలాంటి కార్యక్రమం తొందర లో ఇంకొకటి నిర్వహిస్తే బాగుంటుందని ఆశిస్తూ ,,,,, 

 మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నసీర్

Comments

Anonymous said…
Happy movement's very nice

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories