"I" in me / నా లోని "నేను" - 2

 


Which food is good ? Veg or Non-Veg ??
[For the answer to this, please read after the below Telugu script]


శాకాహారమా లేక మాంసాహారమా, ఏది మంచిది?

నేను ఏమి ఫాలో అవుతానంటే ...... 
[ఆప్షన్ ఉంటే] ఇంట్లో వండినది అయితే మాంసాహారం, హోటెల్ది అయితే శాకాహారం. 
ఎందుకంటే, హోటల్ లో వండే ముందు, సరిగ్గా "క్లీన్" చెయ్యరనే భయం. 

నిజానికి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి అంటే........ 
"ఏది" తింటున్నాము అనే కంటే, "ఎందుకు" తింటున్నాము అని. 

ప్రతీ జీవికి ఆహారం "శరీర పోషణకు" అవసరం. 
స్వేచ్చాజీవులైన పశువులను గమనిస్తేయ్, అవి ఆకలేస్తే తింటాయి. 
ఆకలి లేకపోతె, ఎంత రుచికరమైన ఆహారమైనా అవి తినవు. 

అయితే, మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి, రెండు డైమెన్షన్స్ ఉంటాయి. 
1. శరీర పోషణకు, 2. రుచి కొరకు. 
అందుకే, ఆకలి లేకున్నా, మనిషి ఎప్పుడుపడితే అప్పుడు, రుచిగా ఉన్నవి, మితం లేకుండా, ఎదో ఒకటి తింటూ, కడుపు చెడగొట్టుకొంటూ ఉంటాడు. 

నాకు, నా మిత్రుడు బాలాజీప్రసాద్ మాటలు, "బజారులో బండిమీద వేసే బజ్జీలు చూసి తినకుండా ఉండలేము, తిని కడుపులో ఇబ్బంది లేకుండా ఉండలేము" గుర్తుకు వస్తున్నాయి. 

ఇక శాకాహారం గాని, మాంసాహారం గాని, న్యూట్రిషన్ కొరకు తింటే ఇబ్బంది లేదు. జిహ్వాచాపల్యం కొరకు అయితే మాత్రం, ఇబ్బంది తప్పదు. 
ఎందుకంటే, ఆహారపు అలవాట్లనేవి మనం నివసించే భౌగోళిక పరిస్థితుల మీద, ఆచార వ్యవహారాల మీద, ఇంకా అనేక విషయాలమీద ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు, చాలా పాశ్యాత్య దేశాలలో, విపరీతమైన చలి, మంచు మూలంగా, మొక్కలు పెరగక, మాంసాహారం తినక తప్పదు. మరి అక్కడ శాకాహారమే కావాలంటే కుదరదుగా. 

అయితే, మాంసాహారం లో మనం ఇంకొక జీవి ప్రాణాలు హరించాల్సి వస్తుందే అన్న "మీమాంసకు" సమాధానం ఏమిచెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే ...... 
1. ఆకలి తీర్చుకోవడానికి, శాకాహార జీవులు మొక్కలు, చెట్లమీద, మాంసాహార జీవులు ఇతర జంతువులమీద ఆధార పడక తప్పదు. ఇది సృష్టి ధర్మం. 

2. సైన్స్ ప్రకారం మొక్కలు, చెట్లు కూడా జీవులే కదా. కాకపొతే అవి చలనం లేకుండా, బాధను ప్రకటించకుండా ఉంటాయి కాబట్టి, శాకాహారులకు మాంసాహారులు క్రూరులుగా కనబడవచ్చు,

అందుకే, మనం ఏది తింటున్నాము అనే దానికంటే, ఎందుకు, ఎంత  తింటున్నాము అనే దాని మీద శ్రద్ధ పెట్టి, ఇతరుల ఆహారపు అలవాట్ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే, అందరితో సఖ్యతగా ఉంటూ, మనం ఆనందంగా ఉండగలం

మీ అభిప్రాయాలను క్రింది కామెంట్స్ బాక్స్ లో కానీ, నా వాట్సాప్ నెంబర్ 9491135998 కు కానీ తెలియచేస్తే, సంతోషిస్తాను. 

ధన్యవాదములు 🙏



Which food is good? Veg or Non-Veg??

 

First, let me tell you, what I follow…..
[If there is option], I prefer to take home-made veg or non-veg and in Restaurants "vegetarian" food only . 
Reason for this is, I do have my own doubts about the "clieaning process", while preparation.

Actually, what we need to ask ourselves is ……
Instead of questioning "which type" of food, we should ask "what for" we are eating?
 
As we are aware, all living beings need food, for their survival.
We can observe that the animals eat, only when they feel hungry. If they are not hungry, then they don’t take food, however "tasty" it may be.

However, human consume food for two reasons.
1.     For body nutrition, & 2. For taste purpose.
That is why, human go on eat tasty food items, though they feel hungry or not, without any worries or the need for it and spoil their health.
 
Be it vegetarian food or non-vegetarian food, there is nothing wrong in consuming it, if it is to meet the body nutrition & hunger purpose. But when the food is consumed to satisfy the "SELF" need for taste purpose, then there will be inconvenience, inevitably.
 
However, to address the "conflict" about killing some-other living being for preparing the "Non-vegetarian" food, I would like to state …..
 
1.     To satisfy the hunger, animals should have to depend on plants or animals, depending on their food habits. It is nature’s law and there will be "nothing wrong".

2.     As per science, plants are also having the life and feel pain. Since they are immobile, they can’t express their feelings.
 
Hence, instead of focusing on which food we/others are eating, if we concentrate on why & to what extent we are eating, then we can live in harmony "within" and with others too, without any conflicts.
 
I shall be glad to know your opinions, either in the below comments box to in my WhatsApp number 9491135998.

Regards🙏

===============================
Please click on the below link....................
if you want to see the previous post of this series /  ఈ సిరీస్ లోని ఇంతకు ముందు పోస్ట్ చూడాలనుకొంటే 

if you want to see the next post of this series /  ఈ సిరీస్ లోని తరువాతి  పోస్ట్ చూడాలనుకొంటే 
=================================

Comments

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories