నా కోరిక

ప్రతీ పండగ మంచిని ప్రోత్సహిస్తూ,
మానవులలో "మానవీయ" విలువలను పెంపొందిస్తుంది.

ఈ విషయం లో "దీపావళి" పండగది
ప్రత్యేక స్థానం.

అమావాస్య "రాత్రి" దీపాలను వెలిగించి,
పరిసరాలను "ప్రకాశవంతం" చేసుకొన్నట్లు,
కామ, క్రోధ, మద, మాత్సర్యం వంటి
మనస్సులలో అలముకొన్న "అంధకారాన్ని",
జ్ఞ్యానమనే దీపం ద్వార ప్రజ్వలింపచేసుకొని,
సుఖ సంతోషాలతో, అందరూ హాయిగా జీవించాలి.

తమసోమా జోతిర్గమయ,
మృత్యోర్మా అమృతం గమయ.

అవిద్య అనే అంధకారం నుండి జ్ఞానం అనే వెలుగు వైపు,
మరణం అనే దుఃఖం నుండి అమరత్వం అనే ఆనందం
వైపు ప్రయాణం చేయడం సాధ్యమే.

దీపాలు వెలిగించేటప్పుడు,
మనలోని "వెలుగును" కూడా వెలిగించుకుందాం.

"మంచికి చెడుపై విజయం,
జ్ఞానం, అజ్ఞానంపై విజయం సాధించినట్లుగా,
ఈ దీపావళి మీ జీవిత ప్రయాణంలో
మీకు మార్గదర్శకత్వం వహించే అంతర్గత వెలుగును
వెతుకుకోవడానికి మిమ్ములను ప్రేరేపించాలి"
అని కోరుకొంటూ.....

మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నశీర్.

Comments

Well said. Grateful to you for enlightening me Brother
Thanks for your comments, Sir.

May Almighty bless all, with WISDOM & Happiness.


Regards 🙏

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories