నా లోని "నేను" - 24 [సక్సెస్ స్టోరీ]

నేను చాలా సంవత్సరాలుగా  గమనించిన ఒక వ్యక్తి  స్ఫూర్తిదాయక జీవిత కధనంతో, 
ఈరోజు మీ ముందుకు వస్తున్నాను.
ఇతని పేరు ప్రకాష్.  
తిరుపతి, తీర్థకట్ట వీధిలో ఉన్న కోట్ల రూపాయల  విలువ చేసే క్రింది ఫొటోలో ఉన్న   శ్రీ రాఘవేంద్ర స్వీట్ షాప్ కు ఈయనే  "ఓనర్". 

1997 లో ఏమీ లేని క్రింది స్థాయి నుంచి, ఈ రోజు ఈ స్థాయికి ప్రకాష్ గారు  వచ్చారు. 

నేను రెండు రోజులకు ముందు ఆ షాపుకు వెళ్ళినప్పుడు, "ప్రకాశం, చాలా తక్కువ స్థాయి నుంచి కోటీశ్వరుని స్థాయికి ఎదిగిన  నీ గురించి, నా బ్లాగ్ లో వ్రాయాలని అనుకొంటున్నాను. మరి నన్ను  వ్రాయమంటావా?" అని అడిగాను. 
"దానిదేముంది, వ్రాయండి సార్" అని ఆయన అన్నారు. 

డబ్బు లేదనో, పరిస్థితులు కలసి రాలేదనో, తగిన చదువు లేదనో,,,
చాలా మంది, చెయ్యాల్సిన ప్రయత్నం చెయ్యక, తమ కలలను "కల్లలు" చేసుకొంటారు. 
అలాంటి వారికి కనువిప్పు కలగాలని, ప్రస్తుతం యువతలో ఉన్న నిరాశ, నిస్పృహలు తొలగించాలనే కోరికతో, ప్రకాష్ గారి జీవిత ప్రయాణం గురించిన వివరాలు సేకరించి, 
అందరికీ  ఈ బ్లాగుపోస్టు ద్వారా తెలియ చేసే ప్రయత్నమే ఇది. 

ప్రకాష్ గారు చిత్తూర్ జిల్లా, కాణిపాకం గ్రామం లో, 1971 లో, ఒక పేద కుటుంబంలో జన్మించారు. 
10వ తరగతి ఫెయిల్. 

తెలిసిన వారి సహాయంతో  మార్కెటింగ్ కమిటీ లో అటెండరుగా 1990 లో ఉద్యోగం లో జాయిన్ అయ్యారు. 1995 లో తిరుచానూరు కు చెందిన తమ దూరపు బంధువుల అమ్మాయిని పెండ్లి చేసుకొని, 1996 లో ఒక బాబుకు తండ్రి అయ్యారు. 

అటెండర్ ఉద్యోగం లో వచ్చే తక్కువ జీతం అవసరాలకు చాలడం లేదనీ, ఆ ఉద్యోగం మానేసి తిరుపతి వెళ్ళిపోదామని చెప్పిన భార్య మాటలకు అంగీకరించి, 1996లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరుపతి, తీర్థ కట్ట వీధి లోకి మకాం మార్చారంట.  

తిరుపతి గ్రూప్ థియేటర్స్ దగ్గర ఉన్న అమరావతి హోటల్ లో ఉద్యోగంలో చేరారు. 
"ఎదో పెర్మనెంట్ ఉద్యోగం ఉందికదా అని మా అమ్మాయిని ఇచ్చి పెండ్లిచేస్తే, ఆ ఉద్యోగాన్ని వదిలేశావే" అన్న  అత్తగారి సూటిపోటి మాటలు  ప్రకాష్ గారికి బాధ కలిగించాయంట.  
ఏదైనా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి అందరి నోళ్లు మూయించాలని అనుకొన్నారంట.  

తీర్థకట్ట వీధిలో ప్రకాష్  కాపురం ఉంటున్న ఇంటిక్రింద ఉన్న షాపు ఖాళీ అయితే, దానిని నెలకు  350 రూపాయల లెక్కన, బాడుగకు తీసుకున్నారు. అడ్వాంస్ కు 5,000 రూపాయలు, మురుకులు మొదలైన పిండి వంటలు తయారు చెయ్యటానికి కావలసిన వంటసామాగ్రికి  14,000 రూపాయలు అవసరమై, కుదువ అంగడిలో నగలు కుదువ పెట్టి తీసుకొన్నారు. 

ఆ విధంగా 1997లో ఒక చిన్న అంగడిలో నేలమీద కూర్చొని పిండివంటలు తయారు చేసి, అమ్మే వ్యాపారం ప్రారంభించారు. 
ఆయన అమ్మే పిండివంటలు చాలా నాణ్యతతో ఉండటం, కావలసిన వాటి బరువు తూచిన  తరువాత దానికి కొంత ఎక్సట్రా కలిపి ఇవ్వటం, షాప్ కు వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం లాంటి విషయాలు నచ్చిన నేను, నాతొ పాటు చాలా మంది, 1997 నుంచి  అక్కడి పెర్మనెంట్ కస్టమర్స్ అయిపోయాము. అతని బిజినెస్ దినదినాభివృద్ధి చెందటం చూస్తూనే ఉన్నాము. 

ఈ బిజినెస్ లో వచ్చిన లాభాలను, ప్రకాష్ ఇండ్ల స్థలాలు, భూములు కొనటం లో పెట్టుబడిలా పెట్టి, మంచి ధరలకు అమ్మటం లాంటి సైడ్ బిసినెస్ చేశారు. 

ప్రకాష్ లో ఉన్న వ్యాపార దక్షతను గమనించిన శ్రీ శంకర్ సింగ్ అనే  SBI బ్యాంకు లో పనిచేసే మేనేజర్ & స్టాఫ్  యూనియన్  లీడర్,,  బాగా ఇంప్రెస్స్ అయి, బిజినెస్ కు  అవసరమైతే బ్యాంకు లోన్ ఇప్పిస్తానని చెప్పారంట. ఇంతలో, అదే తీర్థకట్ట వీధి లో ఉన్న మూడంతస్థుల ఇల్లు అమ్మకానికి వచ్చిందంట. శ్రీ శంకర్ సింగ్ గారి సహాయంతో బ్యాంకు లోన్ తీసుకొని, ఆ ఇల్లు ప్రకాష్ గారు కొనుక్కున్నారు. తరువాత ఆ ఇంటిని, తన బిజినెస్ కు అనుకూలంగా రీమోడల్ చేయించుకుని దానిలోకి తన బిజినెస్ ను షిఫ్ట్ చేశారు. ఇప్పుడు తన వార్షిక టర్నోవర్ 2 కోట్ల వరకు ఉందని చెప్పారు. 

1997 లో నేలమీద కూర్చొని చిన్న బోండా, బజ్జి, మురుకుల వ్యాపారం చేసిన వ్యక్తి, ఈ రోజు తన  దగ్గర 15 మంది కి ఉద్యోగం ఇచ్చి,  కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ చెయ్యటం,  ఎంత అద్భుతమైన విషయం.  అదీగాక, ఇతనికి పెద్ద చదువు, వెనుక ఆస్తి పాస్తులు  కూడా లేవు. 
ఎంత కస్టపడి ఉంటారు? అంతా స్వంత కష్టార్జితమే. 

నాకైతే, చిరంజీవి నటించిన "స్వయం కృషి" సినిమా గుర్తుకు వస్తుంది. 
ఎందుకంటే ఆ సినిమా కధకు, ప్రకాష్ గారి జీవిత కథకూ చాలా పోలికలు, నాకు  కనబడ్డాయి. 

ఆ సినిమా లో హీరో చాలా పేదవాడు. నేలమీద కూర్చొని చెప్పులు కుట్టే పని చేసేవాడు. నిజాయతీతో పనిచేసి డబ్బులు సంపాదించేవాడు. చేస్తున్న పనిని మన్సపూర్తిగా ఇష్టపడి చేసేవాడు. ఉన్నత స్థితికి ఎదిగినా కూడా,, తను ఏస్థాయి నుంచి వచ్చాడో, చివరి వరకూ గుర్తుచేసుకొంటూ ఉండేవాడు.
 
మరి ప్రకాష్ గారి విషయానికి వస్తే, నాకు తెలిసి, వ్యాపారం ప్రారంభించిన తరువాత, చాలా కాలం ఈయన షాప్ లో క్రిందనే కూర్చుని అమ్మేవారు. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే తప్ప, చిరాకులు గాని, బాధ గానీ చూడలేదు. ఇప్పటికీ, ఇన్ని కోట్లకు అధిపతి అయినా, తన పాత స్థితిని, అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకొంటూ, మా అందరితో చాలా బాగా, ఆప్యాయతతో మాట్లాడుతూ ఉంటారు.  ఇలాంటి మనస్తత్వంతో వ్యవహరించేవారు, ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు అనటం లో సందేహమే లేదు కదా!!
  
ఇంత వ్రాసిన తరువాత నాకు అనిపిస్తున్నది ఏమిటంటే....... 
అందరూ గొప్పగా జీవించాలని అనుకొంటారు. అందుకు అవకాశాల కొరకు ఎదురుచూస్తూ, కాలం గడిపేస్తారు. ఒకవేళ చిన్న చిన్న అవకాశాలు వచ్చినా, వాటివల్ల ప్రయోజనం ఉంటుందా అనే సందేహంతో, ఏమైనా తేడా వస్తే ఎలా అనే భయంతో, వాటిని వినియోగించుకోరు. 
ధైర్యం చేసి ముందుకు అడుగు వేస్తె, calculated రిస్క్ తీసుకొని, మనం అనుకొన్న పనిని పట్టుదలతో చేస్తూ పోతూ ఉంటె, ముందు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, కాలక్రమేణా పరిస్థితులు అనుకూలించి, అనుకోని వైపులనుంచి సహాయం అంది, ప్రకాష్ గారి మాదిరి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు కదా!  
ఏమంటారు?
మీకేమనిపిస్తోంది??  కామెంట్స్ లో వ్రాయండి. 

మీరెవరైనా ప్రకాష్ గారితో మాట్లాడాలీ అనుకొంటే, ఆయన ఫోన్ నెంబర్: 91777 77046. 

మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. 
94911 35998

Comments

ఎవ్వరైనా కామెంట్స్ లో ఏమైనా వ్రాస్తే, అది ఇక్కడ కనబడకపోతే, నిరాశ చెండవద్దు.ఒక రోజు తరువాత ఆ కామెంట్ పబ్లిష్ అయి కామెంట్స్ బాక్స్ లో కనబడుతుంది.

మీ ప్రతిస్పందనలు నాకు, ఇలాంటి blogposts వ్రాయటానికి ఇన్స్పిరేషన్ ఇస్తాయి.

ధన్యవాదములు
Keep educating the surroundings with what you know, the reflection will identify and teach the society with much more. Be epitome to the surroundings and society, thank you for your contribution. Regards
Thanks a lot for your comments, dear Rajendra Prasad Ji.

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories