నా లోని "నేను" - 23
ప్రియ మిత్రులారా,
మీ అందరికీ 77 వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు.
ఈ రోజు ఉదయం వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఉంటే, అన్నీ స్వతంత్ర దిన శుభాకాంక్షలతో,
నా మనస్సుకు హాయిని కలిగించాయి.
కానీ, ఒక highly educated ప్రొఫెషనల్స్ ఉన్న గ్రూప్ లో పోస్ట్ అయిన క్రింది మెసేజ్ మాత్రం, నా మనస్సును కలచివేసింది.
ఆ మెసేజ్, దానికి నేను పంపిన రెస్పాన్స్ ను,, copy/paste 👇చేస్తున్నాను.
విచిత్రమైన వ్యంగ్యం😔
విద్యుత్ రేటు
సాధారణ పౌరులు యూనిట్‌కు రూ.7.85.
మసీదు యూనిట్‌కు రూ. 1.85
చర్చి యూనిట్‌కు రూ. 1.85
ఆలయం యూనిట్‌కు రూ.7.85..
ఇది మన లౌకిక భారతదేశం.
ఇదొక విచిత్రమైన సంబంధం.
మసీదు ప్రైవేట్ ఆస్తి అయితే ప్రభుత్వం మతపెద్దలకు ఎందుకు జీతాలు చెల్లిస్తుంది?
దేవాలయం ప్రభుత్వ ఆస్తి అయితే పూజారికి ప్రభుత్వ జీతం ఎందుకు రావడం లేదు?
దేశం మొత్తం తెలుసుకోవాలనుకుంటుంది.
కానీ ఎందుకు అలా?
ఈ స్వరాన్ని విచ్ఛిన్నం చేయవద్దు
అంగీకరిస్తే ఫార్వార్డ్ చేయవచ్చు
ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరీమణులకు ఈ సందేశాన్ని వాట్సాప్ చేయండి, తద్వారా ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరి వారి ద్వంద్వ విధానాన్ని అర్థం చేసుకోగలరు.
🚩🚩🚩🚩🚩🚩
పై మెసేజ్ కు రిప్లై గా నేను ఈ క్రింది మెసేజ్ ను పోస్ట్ చేశాను.
[6:46 AM, 8/15/2023] Helping Hands Naseer:
ఒక్కసారి "Facts check" చేసుకోండి మిత్రమా.
విద్యుత్ రేట్స్ విషయం లో అసలు "నిజం" ఏమిటి అనేది,,,, బాగా తెలుస్తుంది.
ఆ fact check రిపోర్ట్ ను, నేనే ఇక్కడ పోస్ట్ చెయ్యవచ్చు.
అయితే,,,,
అంధత్వం తో మూఢత్వం తలకెక్కిన వారికి అదికూడా fabricated గానే కనబడుతుంది.
నిజంగా పై విషయం పూర్వా పరాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి, తెలుసుకోవాలని, చూడాలనుకునే వారు, ఈ క్రింది లింక్ ను క్లిక్ చేస్తే, పై టాపిక్ మీద ఇంగ్లీష్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ను చూడొచ్చు.
నా చిన్నతనం నుంచి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు, మన దేశంలో మతవిద్వేషం లేదు.
ఒక ముస్లిం మతస్తునిగా, నా స్కూల్ డేస్ లో కానీ, కాలేజీ డేస్ లో కానీ, బ్యాంకు లో ఉద్యోగం చేసేటప్పుడు కానీ, ఏ విధమైన వివక్షను నేను ఎదుర్కొనలేదు.
నా క్లోజ్ ఫ్రెండ్స్ లో 99% ఇతర మతస్థులే.
ఈ మధ్య కాలం లోనే, గత కొన్ని సంవత్సరాలుగా, ఇలాంటి మెసేజెస్ ద్వారా, హేట్ స్పీచెస్ ద్వారా, ప్రజలలో ద్వేషభావాన్ని రేకిత్తించి, మతాల వారీగా విడదీసే ప్రయత్నాలు, ముమ్మరంగా జరుగుతున్నాయి.
"పదుగురాడు మాట పాడి అయి చెల్లు ధరలోన" అన్న నానుడి ఉండనే ఉంది కదా.
అందుకే, ఒక పధకం ప్రకారం, రాజకీయ లబ్ది కొరకు, వాట్సాప్ లో ఇలాంటి మత విద్వేషాన్ని పెంచే మెసేజెస్, వీడియోలు, అనేక మంది ద్వారా, కావాలనే పదే పదే పోస్ట్ చేయిస్తు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు.
అదిచూసి కొందరు, ఆవేశం పెంచుకొని, అవకాశం వచ్చినప్పుడు, అమాయకులను హింసిస్తూ,, రాక్షసానందాన్ని పొందుతూ ఉంటారు.
గతంలో ఇలాంటి సంఘటనలు, చాలా జరిగాయి.
ప్రస్తుతం "మణిపూర్" లో జరుగుతున్న హింసాకాండ దీనికి ప్రత్యక్ష సాక్షం.
కావాలంటే ఈ క్రింది వీడియో చూడండి.
అందుకే,
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా మనవి ఏమంటే,,
ఇలాంటి మెసేజ్ లు మనదృష్టికి వచ్చినప్పుడు,
మనం "ముందుగా" నిజా నిజాలను ధృవీ కరించుకొందాం.
కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే మెసేజెస్ ను, తగు రీతిలో వ్యతిరేకిస్తూ,
"మౌనం వీడి", మన భావాలను ఇతరులతో పంచుకొందాం.
ఎందుకంటే,,,
చెడ్డవాడు చేసే "చెడు" కన్నా, మంచివాడి "మౌనం",,
సమాజానికి ఎక్కువ "హాని" చేస్తుంది.
విజ్ఞత కలిగిన మనుషులుగా మనము వ్యవహరించి, ఇతరులకు ఆదర్శంగా నిలుద్దాం.
మీరంతా ఈ ప్రపోజల్ అంగీకరించి,
తగు విధంగా ప్రవర్తిస్తారని ఆశతో....
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్.
[94911 35998]
గమనిక:
మిత్రులు శ్రీ Subramanyam గారు, శ్రీ విష్ణుప్రసాద్ గారు, వాట్సాప్ ద్వారా, పై బ్లాగు లోని లోపాలను నాకు తెలియచేసినందులకు, నా మనః పూర్వక ధన్యవాదములు.
ఈ సందర్భం గా, ఒకరి విమర్శ నా మనస్సుకు చాలా బాధ కలిగించింది.
ఇలా, నాలో చెలరేగుతున్న భావాలను, గంటల తరబడి కష్ట పడి, బ్లాగ్ లో వ్రాసి, ఇతరులతో పంచుకోవటం "అవసరమా" ? అనే ప్రశ్నను నాలో రేకెత్తించింది.
అయితే సద్విమర్శ, మనలోని లోపాలను సరిచేసుకునే అవకాశం ఇస్తుంది కదా!
అందుకే నన్ను విమర్శించే మిత్రులకు నా ధన్యవాదములు.
నాకు ఎప్పుడూ ఈ క్రింది ప్రార్ధన గుర్తుకు వస్తూ ఉంటుంది.
O Almighty,Grant me......
the "Courage" to change what I can,
the "Serenity " to accept, what I can not change,
and the "WISDOM" to know the difference.
అందుకే, అన్నీ ఆలోచించి, మనం చెయ్యాలీ అనుకొన్నది "చేస్తూ" పోదాం, అని అనుకొన్నాను.
మన విజ్ఞతకు "మంచి" అనిపించింది, ముందుగా మనం చేసి, ఆచరిస్తూ, దాని గురించి ఇతరులకు వివరిస్తూ,, ఇందులో ఎదురైయ్యే కష్ట నష్టాలను భరిస్తూ, మన దేశ, సమాజ శాంతి కొరకు మనమందరమూ ప్రయత్నిద్దాం.
సర్వేజనా సుఖినోభవంతు🙏

Comments
Thanks for your comments.
As responsible citizens of our beloved country,
we must do, what we can, in a suitable way and
strive to protect the innocent from the atrocities.