నా లోని "నేను" - 13
ఈరోజు అంటే 4.8.2023 ఉదయం వాకింగ్ నుంచి తిరిగి వస్తూఉంటే, లీలామహల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మోటర్ సైకెల్ లో ఉన్న ఒకాయయ "హలో సార్" అని ఆప్యాయంగా పలకరించారు.
ట్రాఫిక్ లో ఎందుకు, ప్రక్కన నిలబడి మాట్లాడుకున్దాము రమ్మని, మోటర్ సైకిల్ ను ప్రక్కన పార్క్ చేసి ఇద్దరం ఒకప్రక్క నిలబడ్డాం. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆయన ప్రసాదరావు గారని, ఆయనను నేను HO లో పని చేస్తుండగా 1990 లో ఇన్స్పెక్షన్ కు వెళ్లి ఒకసారి పత్తికొండ బ్రాంచ్ లో కలిశానని. అప్పట్లో ఆయన చాలా హుషారుగా, చలాకీగా పనిచేసేవారు. అప్పట్లో నాకు calculator వాడకం లో ఒక తెలిసిన మెలకువ అక్కడ ఆయనకు చెబితే, ఆయన నాకు తెలియని ఇంకో మెలకువ గురించి చెప్పారు. ఆ విషయాన్ని ఆయనకు గుర్తుచేసి, ఇప్పుడు ఎం చేస్తున్నారని అడిగాను.
శ్రీ VVSN ప్రసాద రావు గారు చాలా బ్రాంచ్ లలో మేనేజర్ గా పనిచేసి, చివరలో చైర్మన్ గారి కోరిక మేరకు RM ఆఫీస్ లో పనిచేసి, అక్కడే క్రెడిట్ మేనేజర్ గా ఫిబ్రవరి 2022లో రిటైర్ అయ్యారంట. అంతకు ముందు 10 నుంచి 15 రోజులు ఒక లోన్ శాంక్షన్ అవ్వటానికి పడుతుంటే, ఈయన వచ్చిన తరువాత రోజుకు ఒక లోన్ ప్రకారం శాంక్షన్ చేస్తూ, మిగతా RM ఆఫీస్ లకంటే, తిరుపతి ఆఫీస్ పనితీరు బాగుండేటట్లు చేసారంట. మేనేజర్ లకు ట్రైనింగ్ ఇవ్వటం, బ్యాంకు అభివృద్ధి లో తన వంతు బాధ్యతలు నిర్వర్తించి, ఆ జ్ఞాపకాలతో ఆనందంగా జీవిస్తున్నట్లు చెప్పారు.
మాటల సందర్భం లో, నాకు పెన్షన్ వస్తోందా అని అడిగారు. Resign చేసాను కదా, అందుకు రావటం లేదు అండ్ చెబితే, HO ను అడుగుతూ ఉండండి, అని చెప్పారు. ఎందుకంటే, రిటైర్ ఐన తరువాత, ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్,,, ఆయన సంతతి ఎడ్యుకేషన్ లోన్ బాలన్స్ డ్యూ వలన HO వాళ్ళు ఆపేస్తే, డైరెక్ట్ గా చైర్మన్ గారి దగ్గరకు వెళ్లి మాట్లాడరంట. సాయంత్రానికంతా ఇష్యూ సెటిల్ అయిందంట.
సదుం లో ఉండే Md. Ali గారు ఈ బ్లాగ్ పోస్ట్ చూస్తే, ప్రసాదరావు గారిని కాంటాక్ట్ చెయ్యండి. ప్రసాదరావు గారి ఫోన్ నెంబర్: 94410 36236. ఎందుకంటే, అలీ గారికి కుడా ఎడ్యుకేషన్ లోన్ విషయం లో ఎదో ఇబ్బంది ఉన్నట్లు, మదనపల్లె RM ఆఫీస్ వాళ్లు GM గారితో మాట్లాడమని చెప్పినట్లు, నాకు అలీ గారు కొన్ని రోజుల క్రితం చెప్పారు.
అన్నట్లు, నా వెంట్రుకలు తెల్లబడి, గడ్డంతో, నా ముఖకవళికలు పూర్తిగా మారిపోయినా , ప్రసాదరావుగారు నన్ను ఆ ట్రాఫిక్ లో గుర్తుపట్టారు అనుకొంటే, అది ఈ బ్లాగుపోస్టు ల ప్రభావమే అనుకొంటాను. ఎందుకంటే, నా ప్రతీ బ్లాగుపోస్టు లో మిత్రులతో సెల్ఫీ లో నా ప్రస్తుత రూపురేఖలు అందరికీ పరిచయం అవుతున్నాయి కదా. కాబట్టే, చాలా సంవత్సరాలుగా కలవని మిత్రులు కుడా నన్ను ఈజీగా గుర్తుపట్టి పలకరిస్తున్నారు.
ఈ రోజుకు ఇంతే! ఇంకొక మిత్రునితో ఇంకోసారి మిమ్ములను కలుస్తాను.
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్ [949113955]
గమనిక: ఈ బ్లాగుపోస్టు లింక్ ను మిగతా వాట్సాప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ చేస్తే ఆ మిత్రులు కుడా ఈ బ్లాగుపోస్టు చూసి ప్రసాదరావు గారిలాగా నన్ను గుర్తుపడతారు కదా.
.

Comments