నా లోని "నేను" - 12
అసలు ఈ "నా లోని నేను" బ్లాగుపోస్టు సిరీస్ ప్రారంభించటం లో నా ఉద్దేశ్యం, నా మనస్సు లో ఉత్పన్నమవుతున్న భావాలకు వాక్య రూపం ఇచ్చి, అందరితో పంచుకోవాలని, భవిష్యత్తులో ఈ వ్రాతల్ని చూసుకొంటూ, ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు, సమాచారం చూసుకొంటూ, అప్పుడు టైం-పాస్ చెయ్యచ్చు అనేది, ఒక ఆలోచన.
అయితే, నా సమవయస్కులకు నాలాగే అనుభవాలతో తలపండి ఉంటుంది కాబట్టి , నా కన్నా చిన్న వారికి చదివే టైం లేక, నేను వ్రాసేది సోది లాగా అనిపించి, ఇంత ముందు నా బ్లాగుపోస్టు లకు అంత ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది కాదు. ఇప్పుడు, నా సహుద్యోగుల ఫోటోలు పెట్టి, వారితో నేను మాట్లాడిన విషయాల గురించి వ్రాయటం వలన, చాలా మంది మిత్రులు చూడటం, రెస్పాండ్ అవ్వటం జరుగుతోంది. ఇది మిగతా మిత్రులకు వారి గతాన్ని గుర్తు చేస్తూ, వారికి కూడా ఆనందాన్ని ఇస్తుందనటంలో సందేహం లేదు. మీ అందరి రెస్పాన్స్ తో , నాకు కుడా ఉత్సాహం పెరుగుతోంది.
నిన్న అంటే, 2.8.2023 సాయంత్రం, ఎవరిని కలుద్దామా అని ఆలోచిస్తూఉంటే, కొన్ని రోజుల క్రితం బాలాజీప్రసాద్ గారు వాకింగ్ సమయంలో చెప్పిన రామచందర్ గారికి జరిగిన ఆపరేషన్ విషయం గుర్తుకు వచింది. వెంటనే ఫోన్ లో రామచందర్ గారికి ఫోన్ చేసి తిరుపతి లోనే ఉన్నారా, ఇల్లు ఎక్కడ అని అడిగి, లొకేషన్ పెట్టమని చెప్పి, వాళ్ళ ఇంటికివెళ్ళి కలిసాను. ఈయన తిరుపతి మధురానగర్ లో ఉంటున్నారు. ఫోన్ నెంబర్: 97015 95838
ఈ మధ్యనే తలకు ఆపరేషన్ జరగటం, మందులను వాడుతూ ఉన్నందువల్లనేమో, ఆయన కొంత వీక్ గా కనిపిస్తున్నారు. అయినా నాతొ చాలా హుషారుగా, ఆప్యాయంగా మాట్లాడారు.
ఈయనకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి విదేశాలలో ఉన్నారంట. రెండో అమ్మాయి తిరుపతిలో ఈయనతోపాటే ఉంటున్నారంట. ఈయన ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందని చెప్పారు.
రామచందర్ గారు 1990లో నాకు శ్రీకాళహస్తి లో ఒక పెండ్లి సంబంధం చూసారు. అప్పుడు ఆయన BN Kandriga మేనేజర్ గా, నేను HO TME Cell incharge గా పని చేసేవాళ్ళం. అప్పటి విషయాలు, మాట్లాడుకొంటూ ఉంటె, ఉమాపతిగారు ప్రక్క వీధిలోనే ఉన్నారు అని చెప్పారు. ఆయనతోనే, అప్పుడే ఉమాపతి గారికి ఫోన్ చేయించి ఇంట్లోనే ఉన్నారని చెబితే, 10 నిముషాలలో ఆయనను కలవటానికి వస్తాను అని చెప్పాను. తరువాత మేము కలసిన వివిధ సందర్భాలు, మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి కొంతసేపు మాట్లాడుకొని, నేను ఉమాపతిగారిని కలవటానికి బయలు దేరాను.
ఉమాపతి గారి ఇల్లు కనుక్కోవటం కొంత ఇబ్బంది అనిపించి ఫోన్ చేస్తే, "నేను వీధిలోనే నిలబడి ఉన్నాను, మీరు వస్తే నేను కనిపిస్తాను" అని చెప్పారు. అలాగే నేను వెళ్ళేటప్పటికి, వీధిలో నిలబడి ఉండి, నన్ను వారి ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు.
నేను, ఉమాపతి గారు హెడ్ ఆఫీస్ లో కలిసి పనిచేశాము. అప్పట్లో, ఆయన personnel డిపార్ట్మెంట్ లో పంచేసేవారు. చాలా కామ్ గా, తనపనేదో చూసుకొంటూ ఉండేవారు. ఆ తరువాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఎక్కడా రాలేదు. ఉమాపతి గారికి ఇద్దరు కుమార్తెలు. పెండ్లిళ్లు అయి విదేశాలలో ఉన్నారు.
ఉమాపతి గారు బ్యాంకు లో తన అనుభవాలను నాతొ పంచుకొన్నారు. ఒకసారి NC Rao గారు బంగారుపాళెం బ్రాంచ్ visit కు వెళ్ళినప్పుడు, రామచందర్ గారు మేనేజర్ గా ఉమాపతి గారు ఆఫీసర్ గా పనిచేసే టైం లో, "మీకేమండి , భీష్మణాచార్యుని లాంటి ఆఫీసర్ ఉన్నారు" అని ఉమాపతి గారి భుజం మీద తట్టి చెప్పారంట. మన NC Rao గారి లాంటి సిన్సియర్ పర్సన్ చేసిన మంచి కామెంట్స్ మనకు ఎన్ని సంవత్సరాలైనా భలే గుర్తు ఉండిపోతాయి కదా. ఇలాంటి సంగతులు తలచుకొంటూ ఉంటే ఎప్పుడైనా మనకు ఆనందం కలుగుతుంది.
ఇలాంటి విషయాలను తీరికగా "నెమరు వేసుకొని" నా మిత్రులకు కొంతైనా ఆనందాన్ని కలుగచేద్దామనేదే, నా ఈ చిన్న ప్రయత్నం. మీరు ఈ బ్లాగుపోస్టు లింక్ ను మిగతా గ్రూప్ లలో పోస్ట్ చేస్తే, వాళ్లకు వాళ్ళ పాత జ్ఞ్యాపకాలను గుర్తు చేసుకొనే వీలు కలిగించిన వాళ్లు అవుతారు.
త్వరలో ఇంకొక మిత్రుణ్ణి కలసి, ఆ విషయాలను మీ అందరితో పంచుకొంటాను.
ధన్యవాదములు 🙏
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [9491135998]
గమనిక: మన గ్రామీణ బ్యాంకు వాళ్ళు మూడో నాలుగో వాట్సాప్ గ్రూప్ లను మైంటైన్ చేస్తున్నారంట కదా. ఈ బ్లాగుపోస్టు లింక్ ను ఆ గ్రూప్ లలోకి ఫార్వర్డ్ చేస్తే, బాగుంటుంది.
,


Comments