నా లోని "నేను" - 11
మన బ్యాంకు లో పనిచేసి, 2006 లో రిటైర్ ఐన మొదటి ఆఫీసర్ గా శ్రీ Usman Baig గారు చాలామందికి తెలిసే ఉంటారు, అని అనుకొంటున్నాను.
ఆయనతో ఫోన్ లో మాట్లాడి, తిరుపతిలో ఆయన ఇంటి అడ్రస్ కనుక్కొని, నిన్న అంటే 1.8.2023 సాయంత్రం ఆయనను కలిసాను.
మేమిద్దరం జోష్యం రామకృష్ణయ్య గారి టైంలో, విజయరామారావు గారి టైం లో HO లో పనిచేశాము.శ్రీ Usman Baig గారు, తిరుపతి పళని టాకీస్ దగ్గర ఉన్న రైతు బజార్ వెనక, ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఆయన ఫోన్ నెంబర్: 88970 95386. వాళ్ళ పెద్దబ్బాయి చిత్తూర్ లో, చిన్నబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యారు. తిరుపతి లో వాళ్ళ అమ్మాయి, ఇద్దరు మనుమలు, తన సతీమణి తో శ్రీ Usman Baig గారు ఉంటున్నారు.
చాలా సంవత్సారాల క్రితం, ఒకసారి కపిలతీర్థం రోడ్డులో కలిసినప్పుడు, శ్రీ Usman Baig గారు తిరుపతి కపిలతీర్థం రోడ్డుకు దగ్గరిలో, ఉన్న వాళ్ళ మామగారింటికి నన్ను తీసుకొని వెళ్లారు. అక్కడ మాటల సందర్భంలో వాళ్ళ మామగారు, తను సత్యవేడు లో తహసీల్దార్ గా పనిచేసినట్లు చెప్పారు. అప్పుడు మా నాన్నగారు కుడా సత్యవేడు లో BDO గా పనిచేశారని చెబితే, మా నాన్న గారి పేరు అడిగి, 1975 లో ఆయన, మా నాన్నగారు ఇద్దరూ సత్యవేడులో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారిని చెప్పారు. అప్పట్లో నేను నగరి లో ఉండి ఇంటర్మీడియెట్ చదువుతున్నందువల్ల, నాకు పరిచయం లేదు. ఈ విషయం తో సహా చాలా విషయాలు మా డిస్కషన్ లో వచ్చాయి.
"అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి" అన్న కొటేషన్ నిన్న ఆయన నోటివెంట వినటం, నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
శ్రీ Usman Baig గారు, వారి కుటుంబసభ్యులతో ఆనందంగా కాలంగడపాలని కోరుకొంటూ,
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్. [9491135998]
గమనిక: మన గ్రామీణ బ్యాంకు వాళ్ళు మూడో నాలుగో వాట్సాప్ గ్రూప్ లను మైంటైన్ చేస్తున్నారంట కదా. ఈ బ్లాగుపోస్టు లింక్ ను ఆ గ్రూప్ లలోకి ఫార్వర్డ్ చేస్తే, బాగుంటుంది.

Comments