నా లోని "నేను" - 10

ప్రియ మిత్రులారా!
నా లోని "నేను" సీరీస్ లో 10 వ ఎపిసోడ్ కు స్వాగతం.
 
మొదటి ఎపిసోడ్ లో చెప్పినట్లు, నా ఫ్రీ టైం ను ఎలా పాస్ చెయ్యాలో తెలియక, 
నా మనస్సు లోని అభిప్రాయాలను నా మిత్రులతో పంచుకొనేనెదుకు, 
నేను ఎంచుకొన్న మార్గం ఇది. 

నా మనమరాలు స్కూల్ లో జాయిన్ అయి, UKG  క్లాస్ కు వెళుతోంది కాబట్టి, 
నా భార్యకు, నాకు చెన్నై లో టైంపాస్ కావటం కొంత కష్టంగా మారింది. 
అందుకు గాను  కొన్ని రోజులు తిరుపతి లో ఉండివెళదామని, 
మేము 10 రోజుల క్రితం తిరుపతికి వచ్చాము. 
 
మనకు ఇష్టమైన పనిలో పడితే "టైంపాస్" ప్రాబ్లెమ్ ఉండదు కదా. 
అందుకే,  మన మిత్రులను కలసిన సందర్భాలు, అప్పుడు మాట్లాడుకున్న మాటలలో,  మిగతావారితో షేర్ చేసుకోగలిగిన సంగతులను,,,, ఈ విధంగా వ్రాతరూపంలో  షేర్ చేసుకొంటే, నాకు మరియు ఇది చదివేవారికి కూడా టైంపాస్ బాగా అవుతుందని అనుకొంటున్నాను. 

ఈరోజు అంటే 31.7.2023 ఉదయం వాకింగ్ కొరకు బయలుదేరి, తిరుపతి లీలామహల్ సెంటర్ దగ్గరుకు వెళ్ళేటప్పటికి, మన మిత్రుడు బాలాజీ ప్రసాద్ గారు చిరునవ్వుతో  ఎదురువస్తూ కనబడ్డారు.  ఆయన నవ్వు మొఖం చూసేటప్పటికి నాకు చాలా బాగనిపించింది. 
ఎందుకంటే, రెండురోజులకు ముందు అతనిని కలిసినప్పుడు, చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు. 
మనిషి ముఖం లోని చిరునవ్వు, అతనికి ఎంత హుందాతనాన్ని ప్రసాదిస్తోందో కదా! 
ఈ జ్ఞాపకాలను భద్రపరుచుకోవాలని వెంటనే ఒక సెల్ఫీ తీసుకొన్నాను. అదే ఇది. 👇


ఇంక వాకింగ్ కొరకు ప్రకాశం పార్క్ కు వెళ్లటంకన్నా, ఈయనతో మాట్లాడుతూ వెనక్కి వెళ్ళటం బాగుంటుందనుకొని ఆయనతోపాటే దేవేంద్ర థియేటర్ వైపు మేమిద్దరం నడక ప్రారంభించాం. 

మన బ్యాంక్ స్టాఫ్ మనస్తత్వాలు, ఆత్మాభిమానానికి - అహంకారానికి మధ్య తేడా 
[బ్రహ్మానందం, కోవై సరళ  సినిమా సన్నివేశాలు],,,, 
మిత్రులు చాలాసేపు మాట్లాడుకోవాలంటే కామన్ గా  ఉండాల్సిన అలవాట్లు,,,,  
మొదలైన విషయాలు మాట్లాడుకొంటూ, దేవేంద్ర థియేటర్ వరకూ వెళ్లి , 
అక్కడినుంచి ఆయన వాళ్ళ ఇంటివైపు, నేను మా ఇంటివైపు వెళ్ళిపోయాము.  




ఇప్పటికింతే,,,
మీ ప్రియ మిత్రుడు,
అబ్దుల్ నసీర్.  


Comments

B BALAJI PRASAD said…
Dear Naseer sir
I do believe friends form best part of life....being birds of same feather, discussions go round on common topics know to each other and similarly acceptable humour that make us and keep us to meet for subsequent curious and interesting subjects..

regatds

Popular posts from this blog

Helping Hands Strategy...!!!

Ballia Reunion on 7.1.2026

My Ballia Memories