ప్రజా మనస్తత్వం లో మార్పు కొరకు ....
ప్రియ మిత్రులారా!!
గత రెండు రోజులుగా మా గ్రామీణ బ్యాంకు వాట్సాప్ గ్రూప్ లో ఒక మంచి టాపిక్ మీద చర్చ జరుగుతోంది.
ఇది మన దేశ శ్రేయస్సుకు సంబంధించినది కాబట్టి, ఆ చర్చా వివరాలు, యధాతధం గా, మీతో పంచుకొంటున్నాను.
[8:09 AM, 1/13/2023] Sgb H Sharma Mpl:
ప్రవేట్ సెక్టార్ లో ఉంటే రోజుకు 2 గుడ్లు పెడుతుంది.( అదే యూనిట్, అదే manpower.)
[1:00 PM, 1/13/2023] Sgb S Subramanyam :
అవునవును.... మనింట్లో గుడ్లు పెట్టే బాతునిచ్చేసి...
చిక్కెన్ బిర్యానీ తెచ్చుకోని తింటే ఆ పూటకి తృప్తిగా ఉంటుంది...
next day నుండి... అప్పుల కోసం ఎగబడేది...
లేదంటే పెళ్ళాన్ని (ప్రజల్ని పన్నులతో) బాదేది... అంతేగా..
[3:50 PM, 1/13/2023] Sgb Pichaiah Kanupuru:
Airindia ని టాటా లు అన్ని కొట్లు పెట్టి కొని నష్టాలలో నడుపుతారా?
మరి GOI లొ ఉన్నపుడు నష్టం ఎదుకొచ్చింది.
BSNL ఎందుకు నష్టాలలో నడుస్తుంది.
అల్ల్విన్ ఎందుకు అమ్మేశారు.
మనలో ఎవరైనా GOVT PRODUCTS కొంటున్నమా?
ఇంతెందుకు
సరదాగా ఎప్పుడైనా "హరితా " రెస్టారెంట్ కు వెళ్లామా?
అందరందురే.అందరందరే.
[4:08 PM, 1/13/2023] Sgb H Sharma Mpl:
కుక్కను చంపాలంటే అది పిచ్చిదని ముద్రవేసి చంపుతారు.
అలాగే నష్టంవచ్చేట్లు చేసి అమ్ముతారని గమనించండి పిచ్చయ్య గారు.
మరి నష్టాలు వస్తున్నదాన్ని లేక లాభాలు రావాలంటే దాన్ని మాత్రం
ప్రైవేటు వాడు ఎందుకు కొంటాడూ అనికూడా ఆలోచించండి.
వాటిల్లో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది కనుకే కొంటున్నాడు.
విశాఖ స్టీల్ పరిశ్రమకవసరమైన ఇనుమును కేటాయించకుండా, ముడిసరకు ఎక్కువరేట్లకు కొనిపించి నష్టం తెప్పించి అమ్మకానికి పెడుతున్నారే ఇదిన్యాయమా?.
Bsnl అడుగుతున్న 5g BSNL కు ఇవ్వరు. అంబానీకీ ఇస్తారు..
మనమంతా రిలయన్స్ జియో కు పోతాము.
మరి bsnl కు నష్టంవస్తుంది.
So policy మారితేనే Public sector మనుగడ ఉంటుంది సార్ గమనించండి. బలపర్చండి.
[4:53 PM, 1/13/2023] Helping Hands Naseer:
ఉదాహరణలు, విశ్లేషణలు బాగున్నాయి..
కానీ.....
ప్రజలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించినా,
ప్రభుత్వాలు చెయ్యాలి అనుకొన్నవి చేసుకొంటూ పోతున్నాయి.
మనం ఏం చెయ్యగలం,,
దానిని ప్రణాళికా బద్ధంగా ఎలా చెయ్యవచ్చు,,,
అన్న దానిమీద చర్చ జరిగితే,,,
భవిష్యత్తు లో ఉపయోగ పడుతుంది.
ఏమంటారు ??
[5:21 PM, 1/13/2023] Sgb H Sharma Mpl:
మీలాంటి తెలిసినవారందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించి,
ఈప్రభుత్వానికి నిరసన తెలిపిన పుడు, ఈతప్పుడు పాలసీలను అంగీకరించడంలేదు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమను బలపర్చరూ అన్న సంకేతం వెళితే ఈఅమ్మకాలు, ప్రైవేటీకరణ ఆగిపోతాయి సార్.
[11:33 PM, 1/13/2023] Sgb S Subramanyam :
Bulldozer ని ఆపాలంటే... గులక రాళ్ళు సరిపోవు సార్...
పెద్దగుండ్లు అడ్డం వేయాలి...
ఓట్లు అనే గుండ్లు అడ్డంపడితే తప్ప అరాజకీయ Bulldozer లు ఆగవు...
అందుకు జనంలో చైతన్యం రావాలి...
కానీ ఇప్పుడు జనాలక్కావల్సింది బిస్కెట్ లే తప్ప.... భవిష్యత్తుకాదు...
తాయిలాలే తప్ప తరతరాలు నిలిచే అభివృద్ధి కాదు...
ఓటుకొచ్చే రూ.2000 లు కోసం తన్నుకుంటారుగానీ...
టాక్స్ పేరుతో పోగొట్టుకునే రూ.20000 లు గురించి ఆలోచించరు.
ఆలోచించే మనలాంటివాళ్ళు చాలామంది ఓటుకు, నోటుకు దూరంగా ఉంటారు.
దానివల్ల నోట్లకొచ్చిన ఓట్లతోనే వాళ్ళు గెలిచేస్తారు.
ఈ పరిస్థితి మారాలంటే.. ఏం చెయ్యాలి?
ఎం చెయ్యాలి అంటే ....
నా ఉద్దేశం లో ముందు మనం మారాలి.
అంటే "సరైన విలువలతో" మనం జీవించాలి.
మన "ప్రవర్తన" ద్వారా ఇతరులలో మార్పు తేవాలి.
ఇది తరతరాలకు కొనసాగేలా బాల్యం నుంచే పాఠశాలలో పాఠ్యఅంశాలుగా బోధించాలి.
మరి "సరైన విలువలు" అంటే ఏమిటీ, అనే సందేహం వస్తుంది కదా.
సరైన విలువలు అంటే........
నేను ఆనందంగా ఉండటానికి,
నాతో పాటు,,,,,
నా కుటుంబ సభ్యులు, బంధు మిత్రులూ, నా వూరివారు, నా దేశ ప్రజలందరూ,
పశు పక్ష్యాదులూ, ప్రకృతి మొత్తం ఆనందంగా ఉండటానికి ...
నేను ఎలా జీవించాలి అని తెలుసుకొని, ఆ విధంగా జీవించటం.
అలా ప్రతిఒక్కరూ సరైన విలువలతో జీవించగలిగితే.....
అప్పుడు ప్రభుత్వాలు గాని, రాజకీయ నాయకులు గాని .....
ఉచితాలతో, మనీ తో, మందుతో, మతోన్మాదంతో,,,, ఎవ్వరినీ మభ్యపెట్టలేవు.
ఇది అసాధ్యం లా కనబడినా,, సుసాధ్యమే.
ఎందుకంటే...
ఈ దిశ గా CHDHC అనే సంస్థ వారు "జీవన విద్య" అనే కాన్సెప్ట్ ద్వారా .......
సరైన విలువలతో జీవించటం ఎలా... అన్నది నేర్పుతున్నారు.
జీవన విద్య కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది.
నా ఉద్దేశ్యం లో "జీవన విద్య" , కుల మతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరికి, వారి కుటుంబం లో, సమాజం లో, విలువలతో జీవించటం ఎలా అన్న విషయాన్ని వివరించి ఆనందం గా ఉండటానికి సహాయ పడుతుంది.
https://www.chdhc.org/ లింక్ ను క్లిక్ చేసి CHDHC సంస్థ website లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా IIT విద్యా సంస్థలలో "Universal Human Values" అనే sabject ను టీచ్ చేస్తున్నారు.
బహుశా, భవిష్యత్ లో అన్ని విద్య సంస్థల్లో ఈ సబ్జెక్టు introduce చెయ్యవచ్చు.
ప్రజలందరిలో మార్పు రావటానికి చాలా కాలం పట్టవచ్చు,
ఈ లోపల కనీసం మనం అన్నా, స్వంత ప్రయత్నాలతో , వీలైనంత నేర్చుకొంటూ,,,,,,, "సరైన విలువలతో" జీవిస్తూ, ఇతరులను ప్రభావితం చేద్దాం.
ఏమంటారు?
మీ ప్రియ మిత్రుడు 🙏
మీ అభిప్రాయాలను, సూచనలను తెలియ చెయ్యండి.

Comments